ముంబై : టీమిండియా క్రికెట్ జట్టుకు.. బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్(Morne Morkel)ను నియమించారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జే షా ద్రువీకరించారు. సౌతాఫ్రికా మాజీ బౌలర్.. గతంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా చేశాడు. ఇండియాలో 2023లో వన్డే వరల్డ్‌కప్ జరిగిన సమయంలో పాక్ బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ ఉన్నాడు. గతంలో అతను ఐపీఎల్‌లోనూ ఆడాడు. కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్ల తరపున అతను ప్రాతినిధ్యం వహించాడు. కొత్త చీఫ్ కోచ్ గంభీర్ నేతృత్వంలో.. మోర్కెల్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మోర్కెల్.. కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.