Jhulan Goswami : భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్, పేస్ బౌలర్ ఝులాన్ గోస్వామి (Jhulan Goswami)కి అరుదైన గౌరవం దక్కనుంది. మహిళ క్రికెట్‌కు విశేష సేవలు అందించిన ఝులాన్ గౌరవార్ధం ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens) మైదానంలోని ఓ స్టాండ్‌కు ఆమె పేరు పెట్టనున్నారు. దాంతో, ప్రతిష్ఠాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో ఈ తరహా గౌరవం అందుకున్న మూడో క్రికెటర్‌గా, మొదటి మహిళగా ఈ దిగ్గజ పేసర్ చరిత్ర పుటల్లో నిలువనుంది.
వచ్చే ఏడాది జనవరిలో ఈడెన్ గార్డెన్స్‌లోని స్టాండ్‌కు ఘులాన్ గోస్వామి పేరు ఖరారు చేస్తామని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(CAB) తెలిపింది. 2025 జనవరి 22న ఈడెన్ గార్డెన్స్‌లో భారత జట్టు, ఇంగ్లండ్‌ల మధ్య టీ20 మ్యాచ్ ఉంది. ఆ గేమ్‌కు ముందు క్యాబ్ అధికారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి.. బ్లాక్ బీలోని ఒక స్టాండ్‌కు ఘులాన్ గోస్వామి అని నామకరణం చేయనున్నారు.
A well deserved honour awaits for Jhulan Goswami ❤#CricketTwitter pic.twitter.com/2Wek3IExHJ
— Female Cricket (@imfemalecricket) November 21, 2024
ఇప్పటివరకూ ఈడెన్ గార్డెన్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ సౌరభ్ గంగూలీ(Sourav Ganguly), దివంగత పంకజ్ రాయ్(Pankaj Rai)ల పేర్లతో మాత్రమే స్టాండ్స్ ఉన్నాయి. దాంతో, తమ రాష్ట్రానికే చెందిన ఝులాన్ గోస్వామిని ఘనంగా గౌరవించాలనుకుంది క్యాబ్. అందుకని ఆమె పేరును బీ బ్లాక్‌లోని స్టాండ్‌కు ఖాయం చేసింది.
బెంగాల్‌లోని నదియా జిల్లాలో ఉన్న చక్దహలో పుట్టి పెరిగిన ఝులాన్ గోస్వామి తొలి తరం మహిళా క్రికెటర్లలో ఒకరు. ఆరడుగుల పొడవుండే ఆమె పేస్ బౌలర్‌గా జట్టులోకి వచ్చింది. ఆమె దేశం తరఫున 2014 వన్డేలు, 68 టీ20లతో పాటు 12 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. సుదీర్ఘ 20 ఏండ్ల కెరీర్లో ఝులాన్ మూడు ఫార్మాట్లలో కలిపి 355 వికెట్లు పడగొట్టింది. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లో 300 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సృష్టించింది ఆమెనే. 2018లో ఝులాన్ ఈ ఘనత సాధించింది.