BCCI :ఆసియా కప్ ఫైనల్లో భారత జట్టు గెలుపొంది నెల రోజులు కావొస్తోంది. కానీ, ఇప్పటివరకూ ట్రోఫీ మాత్రం టీమిండియా చేతికి అందలేదు. విజేతకు అప్పగించాల్సిన ట్రోఫీతో ఆసియా క్రికెట్ కౌన్సిల్(ACC) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) పారిపోవడంపై ఆగ్రహంగా ఉన్న భారత క్రికెట్ నియంత్రణ మండలి చర్యలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని అతడిని హెచ్చరించిన బీసీసీఐ చివరిసారిగా మరోసారి నఖ్వీని మర్యాదగా ట్రోఫీ అప్పగించాలని కోరింది.
ఆసియా కప్ ట్రోఫీ వివాదానికి తెరదించడానికి బీసీసీఐ రెఢీ అవుతోంది. ఇప్పటికైనా సమయం మించిపోలేదని, ట్రోఫీని తమకు అప్పగించాలని ఏసీసీ చీఫ్‌కు ఈమెయిల్ పంపింది బీసీసీఐ. ఒకవేళ నఖ్వీ నుంచి స్పందన వస్తే సరి. లేదంటే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అతడిని హెచ్చరించింది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మంగళవారం నఖ్వీకి ఈమెయిల్ పంపారు. అందులో ఆయన రెండే ఆప్షన్లు ఇచ్చారు. ట్రోఫీని భారత జట్టుకు అప్పగిస్తావా? లేదంటే ఐసీసీకి ఫిర్యాదు చేయమంటావా? అని అందులో హెచ్చరించాడు సైకియా.
India writes to Mohsin Naqvi, wants Asia Cup trophy back
Naqvi says collect trophy from ACC HQ: Reports@suyeshasavant @Nitin_sachin pic.twitter.com/BbuzK0FaiZ
— IndiaToday (@IndiaToday) October 21, 2025
ప్రస్తుతం ఆసియా కప్ ట్రోఫీ దుబాయ్‌లోని ఏసీసీ ఆఫీసులో ఉంది. శ్రీలంక క్రికెట్‌తో పాటు అఫ్గనిస్థాన్ బోర్డు మద్దతు తెలిపాయి. ఆ రెండు దేశాల బోర్డులు కూడా భారత్‌కు ట్రోఫీని అప్పగించాలని నఖ్వీని కోరాయి. అయినా సరే.. నఖ్వీ స్పందించడం లేదు. భారత క్రికెటర్లలో ఎవరో ఒకరు వచ్చి తన నుంచి ట్రోఫీ తీసుకోవాలని అతడు మొండి పట్టుతో ఉన్నాడు. కానీ, భారత్‌పై విషం చిమ్మిన అతడి చేతుల మీదుగా ట్రోఫీని అందుకునే ప్రసక్తే లేదని బీసీసీఐ కరాఖండీగా చెప్పింది. దాంతో.. ఈ వ్యవహారంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. దాంతో.. త్వరలో జరుగబోయే సమావేశంలో ఐసీసీ పెద్దల సమక్షంలోనే తేల్చుకోవాలని బీసీసీఐ భావిస్తోంది.
యూఏఈ ఆతిథ్యమిచ్చిన ఆసియా కప్‌లో భారత్ విజేతగా నిలిచింది. ఉత్కంఠ రేపిన ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి.. రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఛాంపియన్ అయింది. బహుమతి ప్రదానం కార్యక్రమానికి ఏసీసీ ఛీఫ్ హోదాలో మొహ్సిన్ నఖ్వీ వేదికపైకి వచ్చాడు. దాంతో.. అతడి చేతుల మీదుగా ట్రోఫీని అందుకోమని వ్యాఖ్యతకు చెప్పేశారు భారత క్రికెటర్లు. యూఈఏ క్రికెట్ అధ్యక్షుడి ద్వారా తమకు ట్రోఫీ అందించాలని కోరారు.
Respect for Team India. They refused to take the Asia Cup trophy from Pakistani Mohsin Naqvi.#AsiaCupFinal #PKMKBForever pic.twitter.com/AZWW9r9EkG
— Indian Cricket (@IPL2025Auction) September 28, 2025
ఈ విషయం తెలిసిన నఖ్వీ తనతో పాటు ట్రోఫీని తీసుకెళ్లిపోయాడు. దాంతో, ట్రోఫీ లేకుండానే మైదానంలో భారత క్రికెటర్లు సంబురాలు చేసుకున్నారు. అందర్నీ షాక్‌కు గురిచేసిన ఈ ఘటనపై ఆగ్రహించిన బీసీసీఐ.. నఖ్వీ తీరును తప్పుపట్టింది. టీమిండియాకు ట్రోఫీ ఇవ్వాలా ? వద్దా? అనే అంశంపై ఆసియా దేశాలే నిర్ణయం తీసుకుంటాయని ఏసీసీ చీఫ్ తెలిపాడు.