BCCI | బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట (Bengaluru stampede) ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠిన నిబంధనలు తీసుకొచ్చింది. ఐపీఎల్ విజేతలు సెలబ్రేషన్స్‌కు (IPL Celebrations) తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనలను రూపొందించింది. ఈ విషయాన్ని బోర్డు సెక్రెటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు. తొక్కిసలాట ఘటనను బీసీసీఐ తీవ్రంగా పరిగణిస్తోందని వెల్లడించారు.
IPL విజయోత్సవ వేడుకల కోసం BCCI రూపొందించిన మార్గదర్శకాలు
Also Read..
ఓటములకు తెర.. భారత పురుషుల హాకీ జట్టుకు తొలి గెలుపు