మహె (సిషెల్స్): తూర్పు ఆఫ్రికా దేశమైన సిషెల్స్లో జరుగుతున్న నేషనల్ డే బాక్సింగ్ టోర్నమెంట్లో భారత బాక్సర్లు దేశానికి ఏడు పతకాలు ఖాయం చేశారు. పురుషుల విభాగంలో ఆదిత్య ప్రతాప్ (65 కిలోలు), నీరజ్ (75 కి.), హిమాన్షు శర్మ (50 కి.), ఆషిష్ ముద్షనియ (55 కి.), అన్మోల్ (60 కి.), కార్తీక్ దలాల్ (70 కి.) ఫైనల్ చేరి మెడల్స్ ఖాయం చేసుకున్నారు.
ఇదే టోర్నీలో గౌరవ్ చౌహాన్ (90 కి.) నేరుగా ఫైనల్కు అర్హత సాధించడంతో భారత్ మొత్తం ఏడు పతకాలు సొంతం చేసుకోనుంది.