BCCI – GST : ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) కి పన్నుల రూపంలో ఖర్చు కూడా భారీగానే ఉంటోంది. ఐపీఎల్ వేలం, మీడియా ప్రసార హక్కుల ద్వారా పెద్ద మొత్తంలో ఆర్జించే బీసీసీఐ భారీగా జీఎస్టీ (GST)ని చెల్లిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరీ (Pankaj Chaudhary) వెల్లడించారు.
ఒక ఏడాది కాలంలో బీసీసీఐ 2వేల కోట్ల జీఎస్టీ కట్టిందని పంకజ్ చెప్పారు. 2023-24 వార్షిక సంవత్సరానికి బీసీసీఐ రూ.2,038.55 కోట్లను గూడ్స్ సర్వీసెస్ టాక్స్ కింద కేంద్రానికి ముట్టజెప్పిందని మంత్రి తెలిపారు.
ఐపీఎల్ వంటి క్రీడా కార్యక్రమాలపై 28 శాతం జీఎస్టీ విధిస్తున్నామని పంకజ్ పేర్కొన్నారు. అంతేకాదు ఆదాయపు పన్ను చట్టం 11వ సెక్షన్ కింద బీసీసీఐకి మినహాయింపులేదని ఆయన ఉభయ సభలకు తెలియజేశారు. పథకాల రూపేణ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బీసీసీఐకి ఎలాంటి గ్రాంట్లు ఇవ్వడం లేదని, బీసీసీఐ మీద ప్రత్యక్ష ప్ననులు విధించాలనే ఆలోచన లేదని మంత్రి విన్నవించారు. బీసీసీఏ ఓ స్వతంత్ర సంస్థ. తమిళనాడు సొసౌటీస్ రిజిస్ట్రేషన్ చట్టం 1975 ప్రకారం బీసీసీఐ ఏర్పడింది.