Bajaj Chetak 3201 | దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో (Bajaj Auto) ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ న్యూ చేతక్ 3210 స్పెషల్ ఎడిషన్ (Bajaj Chetak 3201 Special Edition) ఆవిష్కరించింది. న్యూ బజాజ్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ స్కూటర్ ధర రూ.1.29 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఈ నెలలో ఈ-కామర్స్ అమెజాన్ ద్వారా విక్రయాలు ప్రారంభం అవుతాయి. బజాజ్ న్యూ చేతక్ 3210 స్పెషల్ ఎడిషన్ (Bajaj Chetak 3201 Special Edition) లో ఏస్తెటిక్, ఫీచర్ అప్ డేట్స్ ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందామా.
బజాజ్ ఆటో, ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ అమెజాన్ మధ్య సహకార ఒప్పందం తర్వాత ఆవిష్కరించిన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ ‘బజాజ్ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్’ కానున్నది. ఈ స్కూటర్ కొనుగోలు చేయనున్న వారు డీలర్ల ఆధ్వర్యంలో అవసరమైన పేపర్ వర్క్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇటీవలే బజాజ్ ఆటోకు చెందిన వివిధ శ్రేణుల మోటారు సైకిళ్లను మరో ఈకామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
న్యూ చేతక్ 3201 స్పెషల్ ఎడిషన్ స్కూటర్ టోన్ ఆన్ టోన్ ఎంబాస్డ్ డెకల్స్, క్విల్టెడ్ సీట్లతో వస్తుంది. సాలిడ్ స్టీల్ బాడీతో వస్తున్న ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రూక్లిన్ బ్లాక్ పెయింట్ కలిగి ఉంటుంది. వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ67 రేటింగ్ పొందింది. సింగిల్ చార్జింగ్ పూర్తయితే 136 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. గంటకు 73 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందీ ఈవీ స్కూటర్. చేతక్ యాప్ ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ, కలర్ టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో హజార్డ్ లైట్ వంటి ఫీచర్లు ఉంటాయి.
భారీ పరిశ్రమల శాఖ నుంచి ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ (ఈఎంపీఎస్) కోసం చేతక్ ప్రీమియం (Chetak Premium), చేతక్ అర్బన్ -3202 (Chetak Urbane-3202), న్యూ చేతక్ 3201 (New Chetak 3201 Special Edition) స్కూటర్లకు అనుమతులు లభించాయని బజాజ్ ఆటో తెలిపింది. ఈవీల తయారీలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సియేటివ్ (పీఎల్ఐ) స్కీమ్ లో బజాజ్ ఆటో భాగస్వామిగా ఉంది.
iQoo Z9s 5G | బడ్జెట్ ధరకే ఐక్యూ జడ్9ఎస్ సిరీస్ ఫోన్లు.. 21న ఆవిష్కరణ..!
Tata Curvv EV | 7న టాటా కర్వ్.ఈవీతోపాటు చార్జ్ పాయింట్ అగ్రిగేటర్ ఆవిష్కరణ.. ఇవీ డిటైల్స్..!