KTR | ప్రజాపాలనలో ప్రతినిధులకు ప్రతిరోజూ అవమానాలేనా..? అలంపూర్ ఘటనపై కేటీఆర్ ఆగ్రహం
KTR | అలంపూర్ ఎమ్మెల్యే విజయుడితో ప్రభుత్వ అధికారులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో ప్రతినిధులకు ప్రతిరోజూ అవమానాలేనా? అంటూ ప్రశించారు.
KTR | అలంపూర్ ఎమ్మెల్యే విజయుడితో ప్రభుత్వ అధికారులు వ్యవహరించిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపాలనలో ప్రతినిధులకు ప్రతిరోజూ అవమానాలేనా? అంటూ ప్రశించారు. ఎమ్మెల్యే విజయుడుతో గద్వాల జిల్లా యంత్రాంగం వ్యవహరించిన అనుచిత తీరుపై కేసీఆర్ మండిపడ్డారు. ప్రజల చేతిలో తిరస్కరించినబడిన కాంగ్రెస్ నాయకులను అధికారిక సమావేశాలు, కార్యక్రమాలకు ఎందుకు ఆహ్వానిస్తున్నారో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులను అవమానించేందుకు ఈ ప్రభుత్వం ప్రోటోకాల్ విధానాలను ఏమైనా మార్చిందా? అంటూ ప్రశ్నించారు.
అయితే, రాజోలి మండలంలోని తుమ్మిళ్ల లిఫ్ట్ మోటార్లను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే విజయుడు స్విచ్ఛాన్ చేసి నీటిని విడుదల చేశారు. పంప్‌హౌస్ మోటార్లు ఆన్ చేసి ఆర్డీఎస్ కాలువ వద్దకు చేరుకున్నారు. మోటార్లు ఆన్‌చేసి మూడుగంటలైనా నీరు రాలేదు. అయితే, తుమ్మిళ్ల నుంచి విజయుడు వెళ్లి కొద్దిసేపటికే కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే సంపత్ కార్యకర్తలతో కలిసి పంప్‌లను ఆఫ్ చేశారు. దీంతో ఆర్డీఎస్ కాలువకు నీరు నిలిచిందని తెలుసుకున్న విజయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో సకాలంలో వర్షాలు కురవక పోవడంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. రైతుల సమస్యలను గుర్తించి సాగునీటిని విడుదల చేస్తే కాంగ్రెస్ నాయకులు అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు. రైతులతో కలిసి తుమ్మిళ్లకు లిఫ్ట్ఇరిగేషన్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఆయన రోడ్డుపై భైఠాయించారు. ఆ తర్వాత ఆయనను పోలీసులు అరెస్టు చేసి వాహనాల్లో తరలించారు.
Praja Palana where our public representatives are humiliated every day
I condemn the atrocious conduct of District officials who have insulted our MLA, Alampur Vijayudu Garu@TelanganaCS What is the reason for insisting on inviting the Congress party leaders who’ve been… https://t.co/p490wZePDl
— KTR (@KTRBRS) August 6, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

