గుడిపల్లి, జనవరి 08 : గర్భిణులు, బాలింతలు 102 అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలని గుడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు సూచించారు. ప్రతి గురువారం అలాగే శనివారం గుడిపల్లి మండలంలోని గర్భిణీలను, బాలింతలను గుడిపల్లి ప్రభుత్వ దావఖానకు తీసుకురాగా వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం వారిని సురక్షితంగా మరలా ఇంటికి చేర్చుటలో 102 అంబులెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ యోగశ్రీ, పీహెచ్ఎన్ పుల్లమ్మ, సూపర్వైజర్లు పద్మ, సుధీర్, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ సలీం, జిల్లా మేనేజర్ మధు. హిమం పాషా, 102 పైలెట్ పి.ప్రవీణ్ కుమార్, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.