న్యూఢిల్లీ: దేశవాళీ టోర్నీల ప్రైజ్‌మనీని బీసీసీఐ భారీగా పెంచింది. ప్రస్తుతం రంజీ ట్రోఫీ విజేతకు రూ. 2 కోట్లు ఇస్తుండగా.. ఇప్పుడా మొత్తాన్ని రూ.5 కోట్లకు పెంచింది. రన్నరప్‌కు కోటి రూపాయలు ఉండగా.. ఇకపై మూడు కోట్లు ఇవ్వనున్నారు.
ఇరానీ కప్ విజేతకు రూ. 25 లక్షల నుంచి రూ. 50 లక్షలకు, దులీప్ ట్రోఫీ విన్నర్‌కు రూ. 40 లక్షల నుంచి కోటి రూపాయలు, విజయ్ హజారే విజేతకు రూ. 30 లక్షల నుంచి కోటి రూపాయలు, ముస్తాక్ అలీ విన్నర్‌కు రూ.25 లక్షల నుంచి రూ.80 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మహిళల వన్డే ట్రోఫీకి గతంలో రూ.6 లక్షల ప్రైజ్‌మనీ ఉండగా.. దాన్ని రూ.50 లక్షలకు పెంచడం విశేషం.