IPL 2025 : కోల్‌కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy)కి భారీ షాక్. అతడికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పడింది. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో జరిగిన మ్యాచ్‌లో వరుణ్ ఐపీఎల్ కోడ్ (IPL Code) ఉల్లంఘించడమే అందుకు కారణం. అసలు ఏం జరిగిందంటే..
ఈడెన్ గార్డెన్స్‌లో సీఎస్కే హిట్టర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను వరుణ్ ఔట్ చేశాడు. ఆ తర్వాత బ్రెవిస్ వైపు చూస్తూ.. కుడిచేతి చూపుడు వేలిని తిప్పుతూ సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే.. అతడి చర్యను తప్పుపట్టిన రిఫరీ ఐపీఎల్ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై కోల్‌కతా స్పిన్నర్‌ను ప్రశ్నించగా అతడు తన నేరాన్ని అంగీకరించాడు. దాంతో, లెవల్ 1 తప్పిదంగా గుర్తించిన కమిటీ వరుణ్‌పై కఠిన చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించడమే కాకుండా ఒక డీమెరిట్ పాయింట్‌ను కూడా కేటాయించింది.
Varun Chakravarthy celebration after taking Brevis wicket🔥🔥 pic.twitter.com/f99GGbvyzF
— KKR Vibe (@KnightsVibe) May 7, 2025
ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన కోల్‌కతా చావోరేవో పోరులో చెన్నైకి తలవంచింది. నూర్ అహ్మద్(4-31) విజృంభణతో 179 పరుగులకే పరిమితమైన రహానే బృందం.. సీఎస్కేను అడ్డుకోలేకపోయింది. డెవాల్డ్ బ్రెవిస్ (52), శివం దూబే(45)ల మెరుపులకు.. ధోనీ(17 నాటౌట్) హిట్టింగ్ తోడవ్వడంతో సూపర్ కింగ్స్ 2 వికెట్ల తేడాతో గెలుపొందింది.
Elation for the men in yellow 🥳@ChennaiIPL make it 1⃣-1⃣ against #KKR in the season with a 2⃣ wicket win at Eden Gardens💛
Updates ▶ https://t.co/ydH0hsBFgS #TATAIPL | #KKRvCSK pic.twitter.com/6MTmj6NPMH
— IndianPremierLeague (@IPL) May 7, 2025
దాంతో, ఈమ్యాచ్‌లో విజయంతో ముందడుగు వేయాలనుకున్న కోల్‌కతా ఆశలకు గండి పడింది. ప్రస్తుతం ఐదు విజయాలు.. పంజాబ్‌తో మ్యాచ్ రద్దు కారణంగా కోల్‌కతా ఖాతాలో 11 పాయింట్లు ఉన్నాయి. ప్లే ఆఫ్స్ బెర్తులపై ఉత్కంఠ నెలకొన్న పరిస్థితుల్లో.. ఆరో స్థానంలో ఉన్న రహానే బృందం చివరి రెండు మ్యాచుల్లో గెలుపొందినా టాప్ -4లోకి దూసుకెళ్లడం కష్టమే.