IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ఆటగాళ్ల భర్తీ ప్రక్రియ జోరందుకుంది. గాయపడిన క్రికెటర్ల స్థానంలో కొత్తవాళ్లను తీసుకుంటున్నాయి ఫ్రాంచైజీలు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) యాజమాన్యం ఇద్దరితో ఒప్పందం కుదుర్చుకుంది. గాయం కారణంగా తదుపరి మ్యాచ్‌లకు దూరమైన నితీశ్ రానా, పేసర్ సందీప్ శర్మ(Sandeep Sharma)ల స్థానాన్ని దక్షిణాఫ్రికా ఆటగాళ్లతో భర్తీ చేసింది. లెఫ్ట్ హ్యాండర్ అయిన నితీశ్‌కు ప్రత్యామ్నాయంగా లువాన్ డ్రె ప్రిటోరియన్ (Lhuan-dre Pretorius), స్పీడ్‌స్టర్ సందీప్ స్థానంలో నంద్రే బర్గర్ (Nandre Burger)లు రాజస్థాన్ స్క్వాడ్‌లో చేరనున్నారు.
పద్దెనిమిదో సీజన్లో నిలకడగా రాణించిన నితీశ్ గాయం వల్ల కోల్‌కతా పోరుకు దూరమయ్యాడు. 11 మ్యాచుల్లో 161.94 స్ట్రయిక్ రేటుతో 217 రన్స్ చేసిన అతడి అత్యధిక స్కోర్.. 81. టాపార్డర్‌లో కీలకమైన రానా స్థానంలో అతడి మాదిరిగా ధాటిగా ఆడగల ప్రిటోరియస్తో రాజస్థాన్ ఒప్పందం చేసుకుంది. ఎస్ఏ 20లో పార్ల్ రాయల్స్ జట్టు తరఫున ఈ యంగ్‌స్టర్ పరుగుల వరద పారించాడు. 12 మ్యాచుల్లోనే 397 రన్స్ బాదాడు. ఇప్పటివరకూ 33 టీ20లు ఆడిన ప్రిటోరియస్ 147.17 స్ట్రయిక్ రేటుతో 911 పరుగులు సాధించాడు.
🇿🇦 Fearless. Power-packed. Royal!
You’ve seen him in Pink — and you’ll see him soon in IPL 2025. 🔥
Lhuan dre Pretorius steps in for Nitish Rana, who’s healing from a calf injury. Speedy recovery, Nitish bhai! 💗 pic.twitter.com/B2JzFUlKZo
— Rajasthan Royals (@rajasthanroyals) May 8, 2025
ఐపీఎల్లో సుదీర్ఘ అనుభం కలిగిన సందీప్ శర్మ ఈసారి 10 మ్యాచులు ఆడాడు. అతడి వేలికి గాయం అయింది. దాంతో, అతడి స్థానంలో సఫారీ పేసర్ నంద్రె బర్గర్ జట్టుతో కలువనున్నాడు. నిరుడు రూ.3.5 కోట్లు పలికిన ఈ యువకెరటం రాజస్థాన్ తరఫున 6 మ్యాచ్‌లు ఆడాడు. రాజస్థాన్ అనే కాదు.. చెన్నై, సన్‌రైజర్స్, ఢిల్లీ జట్లు గాయపడిన ఆటగాళ్ల స్థానాన్ని కొత్తవాళ్లతో భర్తీ చేసిన విషయం తెలిసిందే.
IPL 2024. Powerplay. 153 kmph. Kuch yaad aaya? 👀
Nandre Burger will replace an injured Sandeep Sharma for the remainder of our IPL 2025 season. We wish Sandy a speedy recovery! 💗 pic.twitter.com/Q3cqD3dfkK
— Rajasthan Royals (@rajasthanroyals) May 8, 2025
18వ సీజన్లో తీవ్రంగా నిరాశపరిచింది పరాగ్ బృందం. కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson) గాయపడడం.. వరుసగా మూడు మ్యాచుల్లోనూ విజయాన్ని ప్రత్యర్థికి అప్పగించడం రాజస్థాన్ కొంపముంచాయి. ఢిల్లీతో సూపర్ ఓవర్, కోల్‌కతాపై ఒక్క పరుగు తేడాతో ఓటమి ఆ జట్టు ప్లే ఆఫ్స్ అవకాశాల్ని దెబ్బతీశాయి. 12 మ్యాచుల్లో 8 ఓటములతో టోర్నీ నుంచి నిష్క్రమించిన రాజస్థాన్ తదుపరి రెండు జట్లను ఢీకొననుంది. మే 12న చెన్నై సూపర్ కింగ్స్‌తో, మే 16న పంజాబ్ కింగ్స్‌తో జరిగే మ్యాచుల్లో గెలుపొందాలనే కసితో ఉంది పరాగ్ సేన.