IPL 2025 : భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలకు తెరపడింది. శనివారం సాయంత్రం 5 గంటల నుంచి ఇరుదేశాలు శనివారం కాల్పుల విరమణ(Ceasefire)కు అంగీకరించాయి. దాంతో, యుద్ధ వాతావరణం తొలగిపోయి సాధారణ పరిస్థితులు ఏర్పడే అవకాశముంది. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు వాయిదా వేసిన ఐపీఎల్ 18వ సీజన్ పునరుద్ధరణపై బీసీసీఐ దృష్టి సారించనుంది. మిగతా 16 మ్యాచ్‌లను నిర్వహించి లీగ్‌ను విజయవంతం చేయడం కోసం కార్యాచరణ సిద్దం చేయనుంది.
ఉద్రిక్తతల నేపథ్యంలో ధర్మశాల వేదికగా మే 8వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్‌ను అర్ధాంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఫ్రాంచైజీ యజమానులతో, బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలతో చర్చలు జరిపిన బీసీసీఐ ఐపీఎల్‌ను వారం రోజులు వాయిదా వేసింది. ఇప్పుడు ఇరుదేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో పరిస్థితులు చక్కబడే అవకాశముంది.
TATA IPL 2025 suspended for one week.
More details here 👇👇 | #TATAIPL
— IndianPremierLeague (@IPL) May 9, 2025
దాంతో, తదుపరి 16 మ్యాచ్‌లను హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో నిర్వహించాలనుకున్న బీసీసీఐ .. తన ఆలోచన మార్చుకునేందుకు ఆస్కారముంది. ఇంతకుముందున్న షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్‌లు జరిగేందుకు వీలుంది. కొన్ని డబుల్ హెడర్స్ ఆడించడం ఖాయమని అనిపిస్తోంది. అయితే.. షెడ్యూల్ గురించి బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Thank you, @RailMinIndia, for arranging a special Vande Bharat train on such short notice to ferry the players, support staff, commentators, production crew members, and operations staff to New Delhi.
We deeply appreciate your swift response. 🙌🏽@AshwiniVaishnaw | @JayShah |… pic.twitter.com/tUwzc5nGWD
— IndianPremierLeague (@IPL) May 9, 2025
‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) తదనంతర పరిణామాలతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొనడం.. ఐపీఎల్ వాయిదాకు దారి తీశాయి. దేశం కంటే తమకు ఏదీ ముఖ్యం కాదంటూ బీసీసీఐ లీగ్‌కు బ్రేక్ ఇచ్చింది. ఆటగాళ్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని వాయిదాకే మొగ్గు చూపింది ఐపీఎల్ పాలక మండలి. ధర్మశాలలో చిక్కుకుపోయిన ఢిల్లీ, పంజాబ్ కింగ్స్ ఆటగాళ్లు, సిబ్బంది.. మీడియా, కామెంటేటరీ సభ్యులను భారీ భద్రత నడుమ ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’లో సురక్షితంగా ఢిల్లీకి తరలించింది బీసీసీఐ. అయితే.. భారత్, పాక్‌ల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో కొందరు విదేశీ క్రికెటర్లు స్వదేశాలకు వెళ్లేంందుకు సిద్ధమయ్యారు కూడా.