Zomato Delivery Boy | బంజారాహిల్స్, మే 10 : అకారణంగా జొమాటో డెలివరీ బాయ్‌పై దాడికి పాల్పడిన హోటల్ సిబ్బందిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కేసు నమోదయింది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్ నెం 2లో నివాసం ఉంటున్న ప్రభాత్‌కుమార్(33) అనే వ్యక్తి జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తుంటాడు. విధి నిర్వహణలో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని పంచకట్టు దోశ హోటల్లోని సెల్లార్‌కు వెళ్లిన ప్రభాత్‌కుమార్ తన ఆర్డర్‌ను డెలివరీ తీసుకున్నాడు. బిల్లు మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించేందుకు ప్రయత్నిస్తుండగా నెట్వర్క్ ప్రాబ్లమ్ వల్ల కనెక్ట్ కాలేదు. దీంతో తాను సెల్లార్ నుంచి బయటకు వచ్చి అమౌంట్ పంపిస్తానంటూ ప్రభాత్‌కుమార్ చెప్పాడు. దీంతో హోటల్ సిబ్బంది ఆగ్రహంతో దుర్భాషలాడడంతో గొడవ ప్రారంభమయింది. మాటామాటా పెరగడంతో హోటల్ సిబ్బంది ప్రభాత్కుమార్ను చితకబాదారు. ఈ మేరకు బాధితుడు శనివారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.