లింగాల : మండల కేంద్రానికి చెందిన కానిస్టేబుల్ మోట మహేందర్‌కు ( Constable Mahendar ) పోలీసులు అధికార లాంఛనాలతో శనివారం అంత్యక్రియలు ( Funeral ) నిర్వహించారు. మృతుడు మహేందర్ పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు వెళ్లి ద్విచక్ర వాహనంపై వస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. దీంతో అతడి తలకు బలమైన గాయాలు అయ్యాయి.
చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. పోస్టుమార్టం అనంతరం జిల్లా పోలీసు ఉన్నతాధికారి ఆదేశాల మేరకు లింగాల, పెద్దకొత్తపల్లి ఎస్సైలు వెంకటేశ్వర్లు గౌడ్, సతీష్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో పోలీసులు అధికార లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించారు .