BCCI : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18 సీజన్ ముగిశాక భారత జట్టు కీలకమైన సిరీస్‌లు ఆడనుంది. జూన్‌లో ఇంగ్లండ్ టూర్.. అది పూర్తయ్యాక ఆస్ట్రేలియా పర్యటన(Australia Tour)కు టీమిండియా వెళ్లనుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) ఆదివారం ఆసీస్ టూర్ షెడ్యూల్ విడుదల చేసింది. కంగారు గడ్డపై రోహిత్ సేన మూడు వన్డేలు ఆడనుంది. అనంతరం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత్, ఆతిథ్య జట్టు మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది.
వన్డే సిరీస్‌తో ఆస్ట్రేలియా పర్యటనను భారత జట్టు ఆరంభించనుంది. అక్టోబర్ 19 నుంచి 25 వరకు 50 ఓవర్ల ఫార్మాట్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ మూడింటికి పెర్త్, అడిలైడ్, సిడ్నీ వేదిక కానున్నాయి. ఇక ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అక్టోబర్ 29 నుంచి నవంబర్ 8 వరకు నిర్వహించనున్నారు. నిరుడు ఆస్ట్రేలియా పర్యటనలో చిత్తుగా ఓడిన భారత్ 3-1తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. వన్డే, టీ20 సిరీస్ గెలుపొంది ఆ ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా భావిస్తోంది.
వన్డే సిరీస్.. మొదటి వన్డే అక్టోబర్ 19న – పెర్త్.
రెండో వన్డే, అక్టోబర్ 23న – అడిలైడ్ ఓవల్.
మూడో వన్డే, అక్టోబర్ 25న – సిడ్నీ.
టీ20… మొదటి టీ20, అక్టోబర్ 29న – మనుకా ఓవల్.
రెండో టీ20, అక్టోబర్ 31న – మెల్బోర్న్.
మూడో టీ20, నవంబర్ 2న – బెల్లలెరివె ఓవల్.
నాలుగో టీ20, నవంబర్ 6న – గోల్డ్ కోస్ట్ స్టేడియం.
ఐదో టీ20, నవంబర్ 8న – గబ్బా.