IPL 2025 : వైజాగ్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కష్టాల్లో పడింది. 37 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. మిచెల్ స్టార్క్ విజృంభణతో వరుసగా పెవిలియన్‌కు క్యూ కడుతున్నారు. బౌలింగ్‌లో ఇషాన్ కిషన్(2), లోకల్ బాయ్ నితీశ్ కుమార్ రెడ్డి(0) ఔటయ్యారు. 25 పరుగులకే 3 వికెట్లు పడిన ఆరెంజ్ ఆర్మీని ఆదుకుంటాడనుకున్న ట్రావిస్ హెడ్(22)ను స్టార్క్ బోల్తా కొట్టించాడు. ప్రస్తుతం కుర్రాడు అనికేత్ వర్మ(20), హెన్రిచ్ క్లాసెన్(20)లు ఆడుతున్నారు. పవర్ ప్లేలో హైదరాబాద్ స్కోర్.. 74-4.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్లోనే ఓపెనర్ అభిషేక్ శర్మ() రనౌట్ అయ్యాడు. ట్రావిస్ హెడ్(22)తో సమన్వయ లోపంతో అతడు పెవిలియన్ చేరాడు. గత మ్యాచ్‌లో సున్నాకే వెనుదిరిగిన ఇషాన్ కిషన్(2) ఆత్మవిశ్వాసంగా కనిపించాడు. అయితే.. స్టార్క్ తెలివిగా ఆఫ్ స్టంప్ అవతల వేసిన బంతిని ఆడిన ఇషాన్ బౌండరీ వద్ద స్టబ్స్ చేతికి చిక్కాడు. అదే ఓవర్లో నితీశ్ కుమార్ రెడ్డి పెద్ద షాట్ ఆడే ప్రయత్నంలో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే హెడ్‌ను పెవిలియన్ చేర్చాడు స్టార్క్.