MLA Vivekananda | కుత్బుల్లాపూర్, మార్చి 30 : విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకల్లో భాగంగా ఆదివారం 131 – కుత్బుల్లాపూర్ డివిజన్ బాల్ రెడ్డి నగర్లోని శ్రీ మారుతి సాయి ఉమా సంగమేశ్వర ఆలయంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని బీఆర్ఎస్ పార్టీ విప్, కేపీ ఎమ్మెల్యే వివేకానంద, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ.. ఐకమత్యంతోనే అభివృద్ధి సాధ్యమని భావించి కాలనీవాసులంతా కలిసి ఈ కళ్యాణ మండప నిర్మాణానికి సహాయం చేయడం ఎంతో శుభ పరిణామమన్నారు. అనంతరం ఉగాది పర్వదినాన కళ్యాణ మండప ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు దూదిమెట్ల సోమేష్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, జగద్గిరిగుట్ట శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, డివిజన్ ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, సీనియర్ నాయకులు పప్పిరెడ్డి సురేందర్ రెడ్డి, రమణారెడ్డి, రమేష్, సత్యనారాయణ, అజయ్, శ్రీనివాస్, శ్రీశైలం యాదవ్, కాలనీ సంక్షేమ సంఘం కార్యవర్గసభ్యులు సుధాకర్ రెడ్డి, జేబీ శర్మ, వెంకటేశ్వరరావు, వెంకటయ్య, నారాయణరావు, మోహన్ రావు, అప్పలనాయుడు, రోహిత్ రెడ్డి, దుర్గారెడ్డి, కృష్ణమూర్తి, భగీరథ రెడ్డి, నమో నారాయణ, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
gangula | వృత్తి విద్యా కోర్సులతో బంగారు భవిష్యత్
Collector Rahul Raj | దుర్గామాతను దర్శించుకున్న కలెక్టర్ రాహుల్ రాజ్