Sitara | సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రతల గారాల పట్టి సితార గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సినిమాలలోకి రాకపోయిన కూడా సితార తన సోషల్ మీడియా ద్వారా ఫాలోయింగ్ పెంచుకుంది. ఇక అడపాదడపా యాడ్స్ లో కనిపిస్తూ మహేష్ ఫ్యాన్స్‌ని మంత్ర ముగ్ధులని చేస్తుంది.రీసెంట్గా మహేశ్ బాబు- కుమార్తె సితార తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఓ యాడ్ లో కలిసి నటించగా, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.. వీళ్లు తండ్రి, కూతురిలా లేరని అన్నాచెల్లెలిలా కనిపిస్తున్నారంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపించారు. అలాగే సితార స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ పై కూడా ప్రశంసలు జల్లు కురిపించారు.
ఇక ఇటీవల మహేష్ బాబు.. రాజమౌళి షూటింగ్‌తో బిజీగా ఉండటంతో ఈ మధ్య బయట ఎక్కువగా నమ్రత, సితార కలిసి కనిపిస్తున్నారు. ఏ పార్టీకి వెళ్లినా, ఈవెంట్‌కు వెళ్లినా ఈ ఇద్దరే జంటగా కనిపిస్తూ సందడి చేస్తున్నారు. రీసెంట్గా సితార బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండే పీఎంజే జువెల్లర్స్ 40వ షోరూం ప్రారంభోత్సవం జరిగింది. పంజాగుట్టలో ఏర్పాటు చేసిన ఈ షోరూం ప్రారంభోత్సవంలో సితార, నమ్రత సందడి చేయడమే కాకుండా మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో మహేష్ బాబు మూవీకి సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి.దీనికి సితార స్పందిస్తూ SSMB 29 చిత్రంలో నాన్న లుక్ అదిరిపోతుందని, మీరు ఊహించిన దాని కన్నా కూడా ఈ సినిమా ఎక్కువే ఉంటుందని పేర్కొంది.
ఇంత కన్నా ఈ మూవీ గురించి ఎక్కువ అడగొద్దంటూ సితార చెప్పింది. ఇక పీఎంజీ కోసం తాను మరోసారి మహేష్ బాబుతో కలిసి ఓ యాడ్ చేయబోతున్నట్టు పేర్కొంది. ఇక ఈ క్రమంలో ఓ రిపోర్టర్ మహేష్ బాబు గురించి ప్రశ్న వేసారు. మహేష్ బాబు ఎప్పుడైనా ఏదైనా గోల్డ్ గిఫ్ట్ గానీ, కనీసం గిఫ్ట్ గానీ ఇచ్చాడా? అని అడగగా, దానికి నమ్రత సరదాగా సమాధానం ఇచ్చారు. అసలు మహేష్ బాబుకి ఇలా గిఫ్టులు ఇచ్చే కాన్సెప్ట్ గురించే తెలీదని, ఎప్పుడూ కూడా ఎలాంటి బహుమతి ఇవ్వలేదని నమ్రత సమాాధానం ఇచ్చారు. ఇక నమ్రత, సితార మాత్రం పరస్పరం గిఫ్టులు ఇచ్చుకుంటారట. కాగా, సితార ఇలా బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటం వల్ల వచ్చే డబ్బులన్నీ కూడా ఎన్జీవోలకు, సహాయ కార్యక్రమాలకు విరాళంగా ఇస్తానని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే.