IPL 2025 : విశాఖపట్టణంలో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను అనికేత్ వర్మ(50 : 34 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఉతికారేస్తున్నాడు సుడిగాలి ఇన్నింగ్స్ ఆడుతున్న అతడు అర్థ శతకం సాధించాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో సింగిల్ తీసి ఐపీఎల్లో తొలి ఫిఫ్టీ నమోదు చేశాడు. స్టార్ ఆటగాళ్లు చేతులెత్తేసిన చోట తనదైన శైలిలో బౌండరీలతో రెచ్చిపోతున్నాడీ చిచ్చరపిడుగు.
37 పరుగులకే 4 వికెట్లు పడిన దశలో హెన్రిచ్ క్లాసెన్‌తో కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ఈ యంగ్‌స్టర్.. అయితే.. అతడికి సహకారం అందించేవాళ్లు కరవయ్యారు. కుల్దీప్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన కెప్టెన్ ప్యాట్ కమిన్స్(1) బౌండరీ లైన్ వద్ద ఫ్రేజర్ చేతికి చిక్కాడు. దాంతో, 123 వద్ద ఆరెంజ్ ఆర్మీ ఏడో వికెట్ పడింది.
That trademark 🙏 celebration 💙
Mohit Sharma and Vipraj Nigam combine to send Heinrich Klaasen back 👊
Aniket Verma continues to fight with his maiden #TATAIPL unbeaten 5️⃣0️⃣*
Updates ▶️ https://t.co/L4vEDKzthJ#TATAIPL | #DCvSRH pic.twitter.com/p6iBj7DyyY
— IndianPremierLeague (@IPL) March 30, 2025