Asia Cup 2024 : స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ ముగియగానే.. భారత మహిళల జట్టు డిఫెండింగ్ చాంపియన్‌గా ఆసియా కప్ (Asia Cup)లో ఆడనుంది. శ్రీలంక వేదికగా మరో 13 రోజుల్లో ఈ మెగా టోర్నీ షురూ కానుంది. దాంతో, శనివారం భారత క్రికెట్ బోర్డు 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా, ఓపెనర్ స్మృతి మంధానా వైస్ కెప్టెన్లుగా ఎంపికయ్యారు.
పదిహేను మందితో పాటు మరో నలుగురిని ట్రావెల్ రిజర్వ్‌గా సెలెక్టర్లు తీసుకున్నారు. ఆసియా కప్ టోర్నీపై ఆశలు పెట్టుకున్న షబ్నం షకీల్, అమన్‌జోత్ కౌర్‌లను సెలెక్టర్లు పక్కన పెట్టేశారు. జూలై 19వ తేదీన టోర్నీ ఆరంభం కానుంది. ఆ మరుసటి రోజే భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది.
భారత బృందం : హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మంధాన(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రీచా ఘోష్(వికెట్ కీపర్), ఉమా ఛెత్రీ(వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతీ రెడ్డి, రేణుకా సింగ్, దయలాన్ హేమలత, అశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సంజన సంజీవన్.
ట్రావెల్ రిజర్వ్స్ : శ్వేతా షెరావత్, సైకా ఇషాక్, తనుజా కన్వర్, మేఘనా సింగ్.
India have placed their faith in a tried and tested core group to defend their Women’s Asia Cup title https://t.co/O5ZBiZCrBC
— ESPNcricinfo (@ESPNcricinfo) July 6, 2024
ఈసారి ఆసియా కప్‌లో 8 జట్లు పాల్గొంటున్నాయి. గ్రూప్ ఏలో భారత్, పాకిస్థాన్, యూఏఈ, నేపాల్ .. గ్రూప్ బిలో శ్రీలంక, మలేషియా, థాయ్‌లాండ్, బంగ్లాదేశ్ జట్లు టైటిల్ వేటకు కాచుకొని ఉన్నాయి. 12 గ్రూప్ దశ మ్యాచ్‌ల తర్వాత జూలై 26న తొలి సెమీ ఫైనల్ నిర్వహిస్తారు. జూలై 27 రెండో సెమీ ఫైనల్.. జూలై 29వ తేదీన దంబుల్లా వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.