Ziaur Rahman | ‘చెస్’ ఆడుతూనే మృత్యు ఒడిలోకి.. గ్రాండ్‌మాస్టర్ కథ విషాదాంతం
Ziaur Rahman : ఇష్టమైన రంగంలో అద్భుతంగా రాణిస్తూ.. గొప్ప శిఖరాలకు చేరిన ఓ గ్రాండ్‌మాస్టర్ జీవితం విషాదంగా ముగిసింది. బంగ్లాదేశ్‌కు చెందిన సీనియర్ గ్రాండ్‌మాస్టర్ అయిన రహ్మన్ శుక్రవారం చెస్ ఆడుతూనే మృత్యుఒడిలోకి జారుకున్నాడు.
Ziaur Rahman : ఇష్టమైన రంగంలో అద్భుతంగా రాణిస్తూ.. గొప్ప శిఖరాలకు చేరిన ఓ గ్రాండ్‌మాస్టర్ జీవితం విషాదంగా ముగిసింది. అరవై నాలుగు గడుల ఆటనే నమ్ముకున్న ఆయన మ్యాచ్ ఆడుతూనే తుదిశ్వాస విడిచాడు. ఆయన పేరు జియౌర్ రహ్మాన్(Ziaur Rahman). బంగ్లాదేశ్‌కు చెందిన సీనియర్ గ్రాండ్‌మాస్టర్ అయిన రహ్మన్ శుక్రవారం చెస్ ఆడుతూనే మృత్యుఒడిలోకి జారుకున్నాడు.
స్వదేశంలో జరుగుతున్న నేషనల్ చాంపియన్‌షిప్‌లో రహ్మాన్ పాల్గొన్నాడు. శుక్రవారం ఆయన ఎనాముల్ హొస్సేన్‌తో తలపడ్డాడు. అయితే. గేమ్ 12వ రౌండ్ సమయంలో రహ్మాన్ ఉన్నట్టుండి గుండెపోటుకుతో కింద కూలబడిపోయాడు.
We have very sad news coming in. One of Bangladesh’s top Grandmasters, Ziaur Rahman passed away today while playing in the Bangladesh National Championships. He was 50 years old.
When Ziaur was playing his 12th round game against GM Enamul Hossain, he suddenly fell from the… pic.twitter.com/scftNFtmoN
— ChessBase India (@ChessbaseIndia) July 5, 2024
దాంతో, అక్కడున్నవాళ్లకు ఒక్క క్షణం ఏమీ అర్ధం కాలేదు. రహ్మాన్లో స్పందన లేకపోవడంతో అప్రమత్తమైన నిర్వాహకులు.. ఆయనను వెంటనే ఢాకాలోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. అయితే.. అప్పటికే ఆయన మరణించినట్టు అక్కడి వైద్యులు చెప్పారు. చదరంగమే శ్వాసగా బతికిన రహ్మాన్ అదే ఆట మధ్యలోనే తనువు చాలించడంతో బంగ్లాదేశ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.
కుమారుడి కండ్ల ముందే..
బంగ్లాదేశ్‌లోని ఉత్తమ చెస్ ప్లేయర్లలో రహ్మాన్ ఒకరు. 1993లో గ్రాండ్‌మాస్టర్ టైటిల్ గెలుపొందిన ఆయన.. దేశం తరఫున 17 సార్లు చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొన్నారు. అంతేకాదు చెస్ ఆటలో యువకులకు శిక్షణ ఇచ్చేవారు కూడా. రహ్మాన్ కుమారుడు తహ్సిన్ తజ్వార్ సైతం చెస్ ప్లేయరే. అయితే.. రెహ్మాన్ గుండెపోటుతో కుప్పకూలే సమయానికి అతడు ఆ పక్కనే మరొకరితో తలపడుతున్నాడు. కండ్ల ముందే తండ్రి మరణంతో తహ్సిన్ గుండెలవిసేలా రోదించాడు.
ఇవి కూడా చదవండి
- Sri Sailam | శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి సేవలో ఏపీ హైకోర్టు జడ్జి
- Watch: నడుస్తున్న మహిళ మెడలోని గొలుసు లాక్కెళ్లిన దొంగలు.. తర్వాత ఏం జరిగిందంటే?
- Good news | గోవాకు వెళ్లే రైలు ప్రయాణికులకు శుభవార్త.. సికింద్రాబాద్ నుంచి వారానికి రెండు రైళ్లు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
Punjab | టోల్ ఫీ తప్పించుకునే యత్నంలో కారు బీభత్సం..!
Potassium | వ్యాయామం చేస్తున్నారా.. పొటాషియం ఉండే వీటిని తింటే మేలు..
Anant Singh expelled | ఎమ్మెల్యే అనంత్ సింగ్‌ను.. పార్టీ నుంచి బహిష్కరించిన జేడీ(యూ)
పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి : మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

