Sri Sailam | శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు శనివారం దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయం ప్రధాన గోపురం వద్దకు చేరుకున్న ఆయనకు ఈవో పెద్దిరాజు, వేద పండితులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం మల్లికార్జున స్వామివారిని, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాల అనంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో అర్చక వేద పండితులచే వేద ఆశీర్వచనం చేయించి శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదం, జ్ఞాపిక అందించి సన్మానించారు. కార్యక్రమంలో ఈవోతో పాటు ఏఈవోలు మోహన్ హరిదాస్, శ్రీశైలం వన్ టౌన్ సీఐ ప్రసాద్ రావు పాల్గొన్నారు.