Good news | గోవాకు వెళ్లే రైలు ప్రయాణికులకు శుభవార్త.. సికింద్రాబాద్ నుంచి వారానికి రెండు రైళ్లు
Good news | గోవాకు వెళ్లే రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఇకపై సికింద్రాబాద్ నుంచి వాస్కోడగామా(గోవా)కు వెళ్లేందుకు వారానికి రెండుసార్లు కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించనుంది.
హైదరాబాద్ : గోవా(Goa) కు వెళ్లే రైలు ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త తెలిపింది. ఇకపై సికింద్రాబాద్ (Secunderabad) నుంచి వాస్కోడగామా(గోవా)కు వెళ్లేందుకు వారానికి రెండుసార్లు కొత్త ఎక్స్‌ప్రెస్ (Express Trains) రైళ్లను ప్రారంభించనుంది. సికింద్రాబాద్ నుంచి బుధ, శుక్రవారం కొత్త ఎక్స్‌ప్రెస్ రైళ్లు ( 17039 / 17040 ) నడువనున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) ఎక్స్‌లో పోస్టు చేశారు.
వాస్కోడగామా నుంచి గురు, శనివారం తిరిగి బయలుదేరుతాయని వెల్లడించారు. ఈ రైళ్లు సికింద్రాబాద్, కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బెళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్డెమ్, మడగావ్ జంక్షన్లలో ఆగుతూ వాస్కోడగామా చేరుకుంటుందని ఆయన వివరించారు.
గతంలో వారానికి ఒక రైలు 10 కోచ్‌లతో బయలుదేరి గుంతకల్‌కు చేరుకుని అక్కడి నుంచి తిరుపతి నుంచి మరో 10 కోచ్‌లతో గోవాకు వెళ్లేదని తెలిపారు. ఇదేకాకుండా కాచిగూడ- యలహంక మధ్యన వారానికి నాలుగురోజులు ప్రయాణం చేసే రైలుకు గోవాకువెళ్లే 4 కోచ్‌లను కలిపేవారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో అవసరమైన ఈ రైలును ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

