లక్నో: ఒక మహిళ రోడ్డుపైన నడుస్తుండగా బైక్‌పై దొంగలు అనుసరించారు. ఆమె మెడలోని గొలుసును లాక్కెళ్లారు. (Thieves Snatch Gold Chain) దీంతో అదుపు తప్పిన ఆ మహిళ రోడ్డుపై బోర్లా పడింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం పట్టపగలు వసుంధర ప్రాంతంలోని ఇందిరానగర్‌లో ఒక మహిళ ట్రాలీ బ్యాగ్‌తో రోడ్డుపై నడిచి వెళ్తున్నది. బైక్‌పై వెనుక నుంచి వచ్చిన దొంగలు ఆమె మెడలోని గోల్డ్ చైన్‌ను లాక్కొనిపోయారు. దీంతో బ్యాలెన్స్ తప్పిన ఆ మహిళ రోడ్డుపై బోర్లా పడింది. ఈ సంఘటనలో ఆమె గాయపడింది.
కాగా, అనంతరం ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నిందితులను గుర్తించి అరెస్ట్ చేసేందుకు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్‌ను పరిశీలిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
उत्तर प्रदेश : जिला गाजियाबाद के पॉश एरिया में आत्मनिर्भर बदमाशों ने सड़क पर दिनदहाड़े महिला से सोने की चेन लूट ली। pic.twitter.com/2yEw5d6tI0
— Sachin Gupta (@SachinGuptaUP) July 6, 2024