Ram Charan | సల్మాన్ ఖాన్ బర్త్‌డే వేడుకల్లో లెజెండ్స్ కలయిక.. ధోని-రామ్ చరణ్-బాబీ డియోల్ ఒకే ఫ్రేమ్‌లో
Ram Charan | బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ పుట్టినరోజు వేడుకలు ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి ఏడాది సల్మాన్ బర్త్‌డే అంటేనే బాలీవుడ్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఈసారి ఆ ఉత్సాహం మరింత ఎక్కువగా కనిపించింది. అభిమానులతో పాటు సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకను ప్రత్యేకంగా మార్చారు.
Ram Charan | బాలీవుడ్ మెగాస్టార్ సల్మాన్ ఖాన్ పుట్టినరోజు వేడుకలు ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి ఏడాది సల్మాన్ బర్త్‌డే అంటేనే బాలీవుడ్లో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఈసారి ఆ ఉత్సాహం మరింత ఎక్కువగా కనిపించింది. అభిమానులతో పాటు సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకను ప్రత్యేకంగా మార్చారు. పుట్టినరోజు సందర్భంగా సల్మాన్ తన కొత్త సినిమా టీజర్‌ను విడుదల చేసి అభిమానులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు. టీజర్ రిలీజ్‌తో సోషల్ మీడియాలో ఒక్కసారిగా హైప్ పెరిగిపోయింది. బర్త్‌డే పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.
అయితే ఈ వేడుకల్లో బయటకు వచ్చిన ఓ ప్రత్యేకమైన ఫోటో మాత్రం అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఆ ఫ్రేమ్‌లో సల్మాన్ ఖాన్‌తో పాటు భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్ ఎం.ఎస్. ధోని, టాలీవుడ్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కలిసి కనిపించారు. సినిమా, క్రికెట్ రంగాలకు చెందిన దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో దర్శనమివ్వడంతో అభిమానులు సంబరపడుతున్నారు.సల్మాన్ ఖాన్, రామ్ చరణ్ మధ్య మంచి స్నేహం ఉన్న విషయం తెలిసిందే. గతంలో కూడా వీరిద్దరూ పలు సందర్భాల్లో కలిసి కనిపించారు. రామ్ చరణ్ బాలీవుడ్లో అడుగుపెట్టిన తర్వాత ఈ స్నేహం మరింత బలపడిందన్న మాట వినిపిస్తోంది.
అలాగే బాబీ డియోల్ కూడా సల్మాన్‌కు సన్నిహితుడే. అయితే వీరితో పాటు ఎం.ఎస్. ధోని కూడా అదే ఫ్రేమ్‌లో కనిపించడం మాత్రం అభిమానులకు ఊహించని సర్ప్రైజ్గా మారింది. సాధారణంగా సినిమా వేడుకలకు అరుదుగా హాజరయ్యే ధోని, సల్మాన్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో పాల్గొనడం, అక్కడ రామ్ చరణ్ వంటి టాలీవుడ్ స్టార్‌తో కలిసి కనిపించడం ప్రత్యేక ఆసక్తిని రేపింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు “ఇది నిజమైన లెజెండ్స్ మీటింగ్”, “ఇండియన్ సినిమా, ఇండియన్ క్రికెట్ ఒకే ఫ్రేమ్‌లో” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫ్రేమ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

