Honor 200 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హానర్ (Honor) తన హానర్ 200 5జీ సిరీస్ ఫోన్లను ఈ నెల 18 మధ్యాహ్నం 12.30 గంటలకు భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ హానర్ మ్యాజిక్ ఓఎస్ 8.0 స్కిన్ ఓఎస్ వర్షన్‌పై పని చేస్తుంది. రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 ప్రాసెసర్లతో హానర్ 200 5జీ సిరీస్ ఫోన్లు వస్తున్నాయి. వీటిల్లో హానర్ 200 5జీ, హానర్ 200 ప్రో 5జీ ఫోన్లు ఉన్నాయి.
హానర్ 200 5జీ ఫోన్ బ్లాక్, మూన్ లైట్ వైట్ కలర్ ఆప్షన్లు, హానర్ 200 ప్రో 5జీ ఫోన్ బ్లాక్, ఓషన్ సియాన్ కలర్ ఆప్షన్లలో లభ్యం అవుతుంది. హానర్ 200 ప్రో 5జీ ఫోన్ 6.78 అంగుళాల క్వాడ్ కర్వ్డ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. అమెజాన్, హానర్ ఇండియా వెబ్ సైట్లతోపాటు దేశంలోని ప్రధాన రిటైల్ స్టోర్లలో లభిస్తుంది. రెండు ఫోన్లూ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తున్నాయి. 50-మెగా పిక్సెల్ టెలిఫోటో కెమెరా, 12 -మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ మాక్రో కెమెరా, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 50-మెగా పిక్సెల్ కెమెరాలు ఉంటాయి.
100 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 66 వాట్ల వైర్ లెస్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5200 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. హానర్ 200 5జీ ఫోన్ సుమారు రూ.53,500 (499.99 బ్రిటన్ పౌండ్లు), హానర్ 200 ప్రో 5జీ ఫోన్ సుమారు రూ.74,800 (699.99 బ్రిటన్ పౌండ్లు) పలుకుతుంది.
Mercedes-Benz EQA | 8న భారత్ మార్కెట్లోకి మెర్సిడెజ్ ఈవీ ఎస్యూవీ ఈక్యూఏ.. ఇవీ డిటైల్స్..!
Bajaj Qute CNG Taxi | త్వరలో బజాజ్ నుంచి క్యూట్ సీఎన్జీ ఆటో ట్యాక్సీ..!
Jio | ఓటీటీ బెనిఫిట్ ప్లాన్లు కుదించిన రిలయన్స్ జియో..!
Reliance Jio | వచ్చే ఏడాది ప్రారంభంలో జియో ఐపీఓ..?!