BCCI : స్వదేశంలో ఇంగ్లండ్ లయన్స్(England Lions)తో జరుగబోయే సిరీస్‌కు శనివారం బీసీసీఐ(BCCI) ‘ఏ’ జట్టును ప్రకటించింది. బెంగాల్ ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్(Abhimanyu Easwaran)ను సారథిగా 13 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది.
ఐపీఎల్లో రాణించిన సాయి సుదర్శన్, తుషార్ దేశ్‌పాండే, ఆకాశ్ దీప్, రజత్ పటిదార్లు స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు. భారత ఏ జట్టు ఇంగ్లండ్ లయన్స్‌తో జనవరి 12న వామప్ మ్యాచ్ ఆడనుంది. అనంతరం జనవరి 17న అహ్మదాబాద్ స్టేడియంలో నాలుగు రోజుల మ్యాచ్ జరుగనుంది.
🚨 News 🚨
India ‘A’ squad for 2-day warm-up fixture & first multi-day game against England Lions announced
Details ⬇️https://t.co/GOjfP0TJve
— BCCI (@BCCI) January 6, 2024
భారత ఏ జట్టు స్క్వాడ్ : అభిమన్యు ఈశ్వరన్(కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ప్రదోశ్ రంజన్ పౌల్, కేఎస్ భరత్(వికెట్ కీపర్), మనవ్ సుథార్, పుల్కిత్ నరంగ్, నవ్‌దీప్ సైనీ, తుషార్ దేశ్‌పాండే, విద్వత్ కవెరప్ప, ధ్రువ్ జురెల్, అకాశ్ దీప్.