David Warner : ఆస్ట్రేలియా క్రికెట్లో ఓపెనర్‌గా డేవిడ్ వార్నర్(David Warner) ప్రస్థానం ముగిసింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్(SCG)లో ఆఖరి టెస్టు ఆడేసిన వార్నర్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే.. ఆడినన్ని రోజులు ఈ స్టార్ బ్యాటర్ బౌలర్లపై తిరుగులేని ఆధిపత్యం చెలాయించాడు. కెరీర్ ఆసాంతం దంచికొట్టడమే పనిగా పెట్టుకున్న డేవిడ్ భాయ్ అన్ని ఫార్మాట్లలో చెక్కు చెదరని రికార్డు సొంతం చేసుకున్నాడు.
టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అత్యధిక శతకాలు బాదిన ఓపెనర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో భారత లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డను వార్నర్ బద్దలు కొట్టాడు. వార్నర్ 49 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సచిన్ 45 శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ 451 ఇన్నింగ్స్‌ల్లో ఈ మైలురాయికి చేరుకోగా.. మాస్టర్ బ్లాస్టర్ 342 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించాడు.
David Warner retires with the most hundreds by any opener in international cricket 👏 pic.twitter.com/RgBM1Yso3y
— ESPNcricinfo (@ESPNcricinfo) January 6, 2024
ఫార్మాట్ ఏదైనా జట్టు విజయంలో ఓపెనర్ల పాత్ర చాలా కీలకం. అందుకనే ఓపెనర్లు ఆది నుంచి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ శుభారంభాలు ఇస్తుంటారు. ప్రపంచ క్రికెట్లో అలాంటి విధ్వంసక ఓపెనర్లు చాలామందే ఉన్నారు. ఓపెనర్‌గా అత్యధిక సెంచరీలు నమోదు చేసిన వాళ్లు ఎవరంటే..? సచిన్, క్రిస్ గేల్, సనత్ జయసూర్య, రోహిత్ శర్మ, మాథ్యూ హేడెన్‌లు.
1. వార్నర్ – 451 ఇన్నింగ్స్‌ల్లో – 48 సెంచరీలు
2. సచిన్ టెండూల్కర్ – 342 ఇన్నింగ్స్‌ల్లో- 45 సెంచరీలు
3. క్రిస్ గేల్ – 506 ఇన్నింగ్స్‌ల్లో – 42 శతకాలు
4. సనత్ జయసూర్య – 563 ఇన్నింగ్స్‌ల్లో – 41 సెంచరీలు
5. రోహిత్ శర్మ – 331 ఇన్నింగ్స్‌ల్లో – 40 సెంచరీలు
6. మాథ్యూ హేడెన్ – 340 ఇన్నింగ్స్‌ల్లో – 40 సెంచరీలు