Ambati Rayudu: రిటైర్డ్ హార్టా..? హిట్ వికెటా..? పది రోజులకే ‘పొలిటికల్ గ్రౌండ్’ వీడిన రాయుడు
Ambati Rayudu: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ‘అధికారికంగా’ అరంగేట్రం చేసి పట్టుమని పది రోజులు కూడా కాకముందే కాడి వదిలేశాడు.
Ambati Rayudu: భారత క్రికెట్లో తనదైన ముద్ర వేయడానికి సుదీర్ఘ కాలం వేచి చూసి ఆఖరికి ‘ఏదో అలా వచ్చి వెళ్లిన’ క్రికెటర్‌గా మిగిలిపోయిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఒడిదొడుకులతోనే మొదలైనట్టుంది. కొంతకాలంగా ‘ప్రజలకు సేవ’ చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వస్తున్నాననంటూ ‘ఇండైరక్ట్ హింట్స్’ ఇచ్చి ఎట్టకేలకు గత నెల 28న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న రాయుడు.. పది రోజుల్లోనే మనసు మార్చుకున్నాడు. రాజకీయాల నుంచి కొద్దిరోజులు విరామం తీసుకుంటున్నానని శనివారం ట్విటర్ (ఎక్స్) వేదికగా సంచలన ప్రకటన చేశాడు. పదిరోజులకే రాజకీయాలకు దూరంగా ఉండాలన్నంత ఆయన చేసిన ‘సేవ’ ఏంటి..? క్రికెట్ గ్రౌండ్లో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్న రాయుడుకు పొలిటికల్ గ్రౌండ్లో కూడా ‘అంత వీజీ కాదు’ అన్న తత్వం బోధపడిందా..? రాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడాడు..?
గ్రౌండ్ వర్క్ చేసినా..
గతేడాది ఐపీఎల్ ముగిసిన వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రాయుడు.. సుమారు రెండేండ్లుగా ‘అనధికారిక రాజకీయ కార్యక్రమాల’లో చురుగ్గా పాల్గొంటున్నాడు. గుంటూరులోని తన సొంత నియోజకవర్గమైన పొన్నూరులో పలు సేవా కార్యక్రమాలలో పాలుపంచుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు పబ్లిక్‌గానే మద్దతు ప్రకటించాడు. దీంతో రాయుడు వైఎస్సార్సీపీలో చేరడం పక్కా అని.. పొన్నూరు నియోజకవర్గం నుంచి గానీ లేదంటే గుంటూరు పార్లమెంట్ నుంచి గానీ అతడు బరిలోకి దిగే అవకాశముందని గుసగుసలు వినిపించాయి. ఆ మేరకు వైఎస్సార్సీపీ అధిష్టానం కూడా రాయుడుకు ‘గ్రీన్ సిగ్నల్’ ఇచ్చిందని, అందుకే అతడు గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుంటున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ‘కుల సమీకరణాలకు’ పెట్టింది పేరైన ఆంధ్రా రాజకీయాల్లో ప్రభావశక్తిగా ఉన్న కాపు కులానికి చెందిన రాయుడు చేరికతో అటు పార్టీతో పాటు వ్యక్తిగతంగా రాయుడుకూ కలిసొస్తుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయపడ్డారు. రాయుడు వైఎస్సార్సీపీలో జాయిన్ కాగానే పొన్నూరు టికెట్ కన్ఫమ్ అయిందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరిగింది.
Hit wicket pic.twitter.com/1BzZ40diKQ
— Jagadeesh (@JagadeeshChow3) January 6, 2024
ఎమ్మెల్యేనా..? ఎంపీనా..?
రాయుడుకు పొన్నూరు టికెట్ ఖాయమైందని వైఎస్సార్సీపీ నేతలు చెప్పుకుంటున్నా అధిష్టానం మాత్రం అతడిని పార్లమెంట్‌కు పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. పొన్నూరులో ప్రస్తుతం వైఎస్సార్సీపీ (కిలారి వెంకట రోషయ్య) ఎమ్మెల్యేనే ఉన్నారు. గుంటూరు ఎంపీగా ప్రస్తుతం టీడీపికి చెందిన గల్లా జయదేవ్ ఉన్నారు. రాయుడును పార్లమెంట్‌కు పోటీ చేయాలని అధిష్టానం పట్టుబడుతున్నా అతడు మాత్రం తాను స్థానికంగానే ఉంటానని తేల్చి చెప్పినట్టు తెలుస్తున్నది. ఈ విషయంలోనే రాయుడుకు అధిష్టానంతో బేధాభిప్రాయాలు వచ్చినట్టు వినికిడి.
ఆడుదాం ఆంధ్రా అన్నారు, ఆడకుండానే వెళ్లిపోతున్నారు 🥹
— . (@MeeSouMe) January 6, 2024
మారుతున్న సమీకరణాలను గమనించాడా..?
దీనికి తోడు ఆంధ్రాలో మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కూడా రాయుడు మరోసారి తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం. అధికార పార్టీపై అసంతృప్తి, టీడీపీ – జనసేన పొత్తు, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరికతో అక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ అతడిని బుట్టలో వేసిందన్న అభిప్రాయాలు వినవస్తున్నాయి. క్రికెట్ కెరీర్లో ‘రాజకీయాలకు బలైన’ రాయుడు.. పొలిటికల్ కెరీర్లో మాత్రం అలా కావడానికి వీళ్లేదని ఫిక్స్ అయ్యాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం.. రాయుడు జనసేనలో చేరుతున్నాడని.. పొన్నూరు నుంచే అసెంబ్లీకి పోటీ చేస్తారన్న జనసైనికులు చెవులు కొరుక్కుంటున్నారు. ఇక తెలుగు తమ్ముళ్లు ఎప్పటిలాగే.. ‘జగన్ నిజం రూపం తెలిసినట్టుంది’ అని వాపోతున్నారు. మరి రాయుడు తీసుకున్న నిర్ణయం అతడి అనుకూలిస్తుందా..? లేక బెడిసికొడుతుందా..? అనేది కాలమే నిర్ణయించాలి.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer | 50 రకాల క్యాన్సర్లను ముందుగానే గుర్తించే కొత్త రకమైన పరీక్ష.. ఏంటిది.. క్యాన్సర్‌ను ఎలా గుర్తిస్తుంది..?
Cyclone | ఏపీకి పొంచి ఉన్న మరో తుపాను ముప్పు
Harish Rao | మూడు బడ్జెట్లు.. అవే హామీలు.. అమలెక్కడ?.. ఆరు గ్యారంటీల వైఫల్యాలపై రాహుల్‌కు హరీశ్‌రావు ప్రశ్నలు!
Tamil Cinema | ఇది తమిళ నామ సంవత్సరం.. ఇండియన్ బాక్సాఫీస్‌ను ఊపేస్తున్న కోలీవుడ్!
YS Jagan | ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి చంద్రబాబు, లోకేష్ కారణం : వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

