దుబాయ్: అండర్-19 ఆసియాకప్‌లో బంగ్లాదేశ్ విజేతగా నిలిచింది. సెమీఫైనల్లో భారత్‌పై గెలిచిన బంగ్లా.. ఆదివారం 195 పరుగుల తేడాతో యూఏఈని చిత్తుచేసి ట్రోఫీ కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. రహమాన్ (129) సెంచరీ చేయగా.. రిజ్వాన్ (60), ఆరిఫుల్ ఇస్లామ్ (50) అర్ధశతకాలు సాధించారు. యూఏఈ బౌలర్లలో అహ్మద్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో యూఏఈ 24.5 ఓవర్లలో 87 పరుగులకు ఆలౌటైంది. ధ్రువ్ (25 నాటౌట్) టాప్‌స్కోరర్. బంగ్లా బౌలర్లలో మారుఫ్, రొహనత్ చెరో మూడు వికెట్లు తీశారు.