BAN vs SA 1st Test : సొంతగడ్డపై పులిలా గర్జించే బంగ్లాదేశ్ (Bangladesh) తోకముడిచింది. టీమిండియా చేతిలో ఈమధ్యే చావుదెబ్బ తిన్న బంగ్లా స్వదేశంలో చతికిలబడింది. మిర్పూర్ టెస్టులో దక్షిణాఫ్రికా (South Africa) బౌలర్ల జోరుతో తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటయ్యింది. స్వదేశంలో అంత తక్కువకు కుప్పకూలడం ఇదే మొదటిసారి. కగిసో రబడ(3/26), వియాన్ మల్డర్(3/22)ల పేస్ పవర్ ముందు బంగ్లా బ్యాటర్లు క్రీజులో నిలువలేకపోయారు. అనంతరం ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికాను తైజుల్ ఇస్లాం (5/49) గట్టి దెబ్బ కొట్టాడు. అయినా మిడిలార్డర్ పోరాటంతో తొలిరోజు ఆట ముగిసేసరికి 34 పరుగుల ఆధిక్యంలో ఉంది.
తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌కు ఆదిలోనే వియాన్ మల్డర్ షాకిచ్చాడు. ఓపెనర్ షద్నామ్ ఇస్లాం(0)ను డకౌట్‌గా వెనక్కి పంపాడు. అదే ఊపులో మొమినుల్ హక్(4), కెప్టెన్ నజ్ముల్ హుసేన్ శాంటో(7)లను మల్డర్ పెవిలియన్ చేర్చాడు. అంతే.. 21 పరుగులకే బంగ్లా మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆతిథ్య జట్టు బాధల్ని మరింత పెంచుతూ రబడ.. కేశవ్ మహారాజులు చెలరేగిపోయారు.
KAGISO RABADA – THE FASTEST TO GRAB 300 TEST WICKETS IN TERMS OF BALLS…!!! 🥶#SAvsBAN#BANvSA
— ARPIT• (@ImArpit_18) October 21, 2024
సీనియర్ ఆటగాడైన ముష్ఫికర్ రహీం()ను బౌల్డ్ చేసిన రబడ టెస్టుల్లో 300వ వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన సఫారీ బౌలర్‌గా అతడు రికార్డు సృష్టించాడు.రబడ, మహరాజ్‌లు ఫటాఫట్ వికెట్లు తీయడంతో
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 106 పరుగులకే ఆలౌటయ్యింది. సఫారీ బౌలర్ల జోరుకు అందరూ పెవలియన్ చేరగా.. ఓపెనర్ మహ్ముదుల్ హసన్ జాయ్ 30 రన్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
బంగ్లాదేశ్‌ను స్వల్ప స్కోర్‌కే కట్టడి చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ధాటిగా ఆడుతోంది. 6 పరుగుల వద్ద కెప్టెన్ ఎడెన్ మర్క్రమ్ ఔటైనా మరో ఓపెనర్ టోనీ డిజొర్జి(30), యువకెరటం ట్రిస్టన్ స్టబ్స్(23)లు సమయోచితంగా ఆడి బంగ్లా బౌలర్లకు పరీక్ష పెట్టారు. జోరుగా సాగుతున్న సఫారీల ఇన్నింగ్స్‌కు తైజుల్ ఇస్లాం అడ్డుకట్ట వేశాడు.
Taijul Islam’s strikes dent South Africa as they close in on the lead https://t.co/8YYOAEQG55 #BANvSA pic.twitter.com/akxr6a2LMn
— ESPNcricinfo (@ESPNcricinfo) October 21, 2024
మొదట టోనీని ఔట్ చేసిన తైజుల్.. వరుసగా స్టబ్స్, డేంజరస్ డేవిడ్ బెడింగమ్(11), రియాన్ రికెల్టన్(27), మాథ్యూ బ్రీట్జ్(0)లను పెవిలియన్ పంపాడు. అతడి విజృంభణతో 52-2తో ఉన్న మర్క్రమ్ సేన99-5కు పడిపోయింది. ప్రస్తుతం కైల్ వెర్రెయనె(18 నాటౌట్), వియాన్ మల్డర్(17 నాటౌట్)లు ఆచితూచి ఆడుతున్నారు. తొలిరోజు ఆట ముగిసేసరికి దక్షిణాఫ్రికా 6 వికెట్ల నష్టానికి 140 రన్స్ కొట్టి 34 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.