Naga Vamshi | సితార ఎంటర్టైనమెంట్స్ అధినేత టాలీవుడ్ స్టార్ ప్రోడ్యూసర్ నాగవంశీ ప్రస్తుతం ఏం మాట్లాడిన వివాదాస్పదం అవుతున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న రూ.1500 పెడితే సినిమాతో వచ్చే ఎంటర్టైనమెంట్ మరెక్కడా దొరుకుతుందంటూ వ్యాఖ్యలు చేయగా.. రీసెంట్గా మరో ఇంటర్వ్యూలో మన ఫేవరేట్ సినిమా హీరోకి వెళితే అతడు అతడి నటన చూడాలి కానీ.. కథ, స్క్రీన్ ప్లే ఇవ్వన్ని ఎందుకు అంటూ కామెంట్లు చేశాడు. దీంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. అయితే ఇదే కాకుండా నాగవంశీ సంక్రాంతికి విడుదల కానున్న సినిమాలపై కూడా కామెంట్లు చేయగా అది వివాదానికి దారి తీసింది.
సంక్రాంతికి ఆరు సినిమాలు వస్తాయి కదా.. పోటీ ఎక్కువగా ఉంటుందా..? అని రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఈసారి అన్ని సినిమాలు రావు. వచ్చినా.. పెద్దగా కాంపిటీషన్ ఉండదు అని నాగవంశీ అన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలు వివాదం కావడంతో తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తన మాటలను కొందరు సోషల్ మీడియాలో తప్పుదోవ పట్టించారు. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతికి వస్తుందని.. ఆ సినిమా మాకు పోటీ కాదని నేను చెప్పినట్లు మిస్ లీడ్ చేశారు. నేను చెప్పిన మాటలను కొందరు వ్యక్తులు వాళ్లకు అనుకూలంగా రాసుకున్నారు. ఈసారి సంక్రాంతికి ఆరు సినిమాలు రావు.. మూడు వస్తాయి. ఇలా విడుదలవడం ఇండస్ట్రీలో సహజమే. ఒక ప్రొడ్యూసర్గా నేను మరొకరి సినిమా హిట్ కాకూడదని ఎందుకు అంటాను ?, ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోలేరు అంటూ నాగవంశీ చెప్పుకోచ్చాడు.