Nitish Kumar | ‘పోలీస్ రిక్రూట్‌మెంట్‌ను వేగవంతం చేస్తారా?’.. చేతులు జోడించి డీజీపీని అభ్యర్థించిన సీఎం నితీశ్
Nitish Kumar | బీహార్ సీఎం నితీశ్ కుమార్ మరోసారి తనదైన శైలిలో వ్యవహరించారు. పోలీస్ రిక్రూమ్‌మెంట్‌ను వేగవంతం చేయాలంటూ చేతులు జోడించి డీజీపీని అభ్యర్థించారు. ఇది చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
పాట్నా: బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) మరోసారి తనదైన శైలిలో వ్యవహరించారు. పోలీస్ రిక్రూమ్‌మెంట్‌ను వేగవంతం చేయాలంటూ చేతులు జోడించి డీజీపీని అభ్యర్థించారు. ఇది చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొత్తగా నియమితులైన 1,239 మంది పోలీసు అధికారులకు అపాయింట్మెంట్ లెటర్లను సీఎం నితీశ్ కుమార్ సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలీస్ రిక్రూట్‌మెంట్‌ను వేగవంతం చేయాలని, పోలీస్ శాఖలో మహిళల సంఖ్యను 35 శాతానికి పెంచాలని హోం శాఖ కార్యదర్శి, డీజీపీని కోరారు. ఈ సందర్భంగా నితీశ్ కుమార్ చేతులు జోడించి డీజీపీ అలోక్ రాజ్ వైపు తిరిగి మాట్లాడారు. ‘రిక్రూట్‌మెంట్‌ను మీరు త్వరగా పూర్తిచేస్తారా?’ అని అడిగారు. బీహార్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఆ రాష్ట్ర డీజీపీ అలోక్ రాజ్‌తోపాటు ఆ వేదికపై ఉన్న వారు ఇది చూసి షాక్ అయ్యారు. డీజీపీ వెంటనే కుర్చీ నుంచి పైకి లేచి సీఎం నితీశ్ కుమార్‌కు సెల్యూట్ చేశారు. ఆ తర్వాత మైక్ వద్దకు వెళ్లి ఆయన మాట్లాడారు. ‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేయడానికి బీహార్ పోలీసులు కట్టుబడి ఉన్నారు. మేం త్వరగా రిక్రూట్మెంట్ నిర్వహించి పటిష్టమైన శిక్షణ ఇస్తాం’ అని అన్నారు. దీంతో ‘ధన్యవాదాలు’ అని సీఎం నితీశ్ కుమార్ బదులిచ్చారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

