ఢాకా: భారత్‌లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఆడేదే లేదని భీష్మించుకున్న బంగ్లాదేశ్.. ఐసీసీ అల్టిమేటానికి కూడా తలొగ్గేలా లేదు. భారత్‌లో ఆడతారా? లేక మీ స్థానంలో వేరే జట్టును భర్తీ చేయమంటారా? అని ఐసీసీ ఆదేశించినట్టు వచ్చిన వార్తలపై ఆ దేశ స్పోర్ట్స్ అడ్వైజర్ అసిఫ్ నజ్రుల్ ఆసక్తిరక వ్యాఖ్యలు చేశాడు. నజ్రుల్ మాట్లాడుతూ.. ‘మా జట్టు స్థానంలో స్కాట్లాండ్ను ఆడిస్తున్నారనేదానిపై నాకు సమాచారం లేదు. భారత క్రికెట్ బోర్డు ఒత్తిడికి తలొగ్గి మామీద ఒత్తిడి పెంచడం సరికాదు. ఐసీసీ డిమాండ్లను అంగీకరించం. మేం వేదికను మార్చమని మాత్రమే అడిగాం. గతంలో భారత జట్టు పాకిస్థాన్‌కు వెళ్లనప్పుడు.. అదే పాకిస్థాన్ భారత్‌కు రాలేమని చెప్పినప్పుడు వారి మ్యాచ్‌లను తటస్థ వేదికలకు మార్చిన సందర్భాలున్నాయి’ అని చెప్పాడు.