ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాను భూకంపం వణికించింది. శుక్రవారం ఉదయం సంభవించిన ఈ విపత్తుతో బంగ్లాదేశ్, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు కొద్దిసేపు నిలిచిపోయింది. ఆట మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌లో ఐర్లాండ్ ఇన్నింగ్స్ 56వ ఓవర్ సమయంలో భూమి ఒక్కసారిగా కంపించడంతో మైదానంలో ఉన్న ఆటగాళ్లంతా ఆందోళనకు గురయ్యారు.
స్వల్ప విరామం తర్వాత మ్యాచ్ మళ్లీ మొదలైంది. రిక్టర్ స్కేల్‌పై 5.7 తీవ్రతతో నమోదైన ఈ ఘటనలోఐదుగురు మృతిచెందగా సుమారు వంద మంది గాయపడ్డట్టు సమాచారం. కాగా మూడో రోజు ఐర్లాండ్ 265 రన్స్‌కు ఆలౌట్ అవగా ఆట ముగిసే సమయానికి బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 156/1తో నిలిచింది. ఆ జట్టు ఇప్పటికే 367 రన్స్ ఆధిక్యంలో ఉంది.