Towhid Hridoy : బంగ్లాదేశ్ యువ క్రికెటర్ తౌహిద్ హృదయ్(Towhid Hridoy) నిషేధానికి గురయ్యాడు. అంపైర్‌తో వాగ్వాదం కారణంగా ఈ యంగ్‌స్టర్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(BCB) నాలుగు మ్యాచ్‌లు సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని బీసీబీ ఆదివారం వెల్లడించింది. స్వదేశంలో జరుగుతున్న ఢాకా ప్రీమియర్ డివిజన్ క్రికెట్ లీగ్‌లో తౌహిద్ మహమ్మదీన్ స్పోర్టింగ్ క్లబ్‌కు సారథ్యం వహిస్తున్నాడు. ఇంతకుముందు ఒక మ్యాచ్‌లో అంపైర్‌తో వాగ్వాదం కారణంగా ఒక మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు. ఇప్పుడు ఏకంగా అతడిపై నాలుగు మ్యాచ్‌ల సస్పెన్షన్ పడింది.
షేర్ ఏ బంగ్లా స్టేడియంలో గాజీ గ్రూప్ క్రికెటర్స్‌తో జరిగిన పోరులో తౌహిద్ అంపైర్లతో గొడవపడ్డాడు. తనను ఔట్‌గా ప్రకటించిన అంపైర్ల నిర్ణయాన్ని తప్పుపడుతూ వాగ్వాదానికి దిగాడు. ఔట్ అయినా సరే క్రీజు వీడకుండా అక్కడే ఉండి నిరసన తెలియజేశాడు. దాంతో, బంగ్లా క్రికెట్ నియమావళిని ఉల్లంఘించిన తౌహిద్‌పై మండిపడింది.
Towhid Hridoy has been handed a four-match ban in the ongoing domestic one-day tournament in Bangladesh. He was charged for showing dissent at the umpire after being given out while batting.
Details: https://t.co/FSbkyjtQ0U#Bangladesh pic.twitter.com/7cJpoteYvC
— Cricbuzz (@cricbuzz) April 28, 2025
అతడు మరోసారి ఇలాంటి పొరపాటు చేయకుండా చూడాలనే ఉద్దేశంతో కఠిన నిర్ణయం తీసుకుంది. రూ.10 వేల జరిమానా విధించి.. ఒక డీమెరిట్ పాయింట్ కేటాయించింది. దాంతో, తౌహిద్ ఖాతాలో ఉన్న డీమెరిట్ పాయింట్ల సంఖ్య 8కి చేరింది. ఫలితంగా అతడు 4 మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. 24 ఏళ్ల హృదయ్ బంగ్లా తరఫున ఇప్పటివరకూ 77 మ్యాచ్‌లు ఆడాడు.