పోతంగల్ ఏప్రిల్ 28 : నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని హెగ్డోలి గ్రామం లోని హనుమాన్ ఆలయంలో 19వ అఖండ శివనామ సప్తాహం కార్యక్రమం కనుల పండుగగా కొనసాగుతుంది. ఆలయంలో ప్రతిరోజు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆలయం వద్ద శివనామ సప్తాహం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
ఈ కార్యక్రమం బసవేశ్వర జయంతికి ముగుస్తుందని పేర్కొన్నారు. ప్రతిరోజు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రతిరోజు హనుమాన్ ఆలయంలో పూజా కార్యక్రమాలతో సందడిగా మారిందన్నారు. కార్యక్రమంలో రాజేశ్వర్, నాగరాజ్, అర్జున్ పటేల్, హనుమంతు, రాంబాబు, రాజు, సాయిలు, యాదవ్ రావ్, భక్తులు ఉన్నారు.