PAK vs BAN : బంగ్లాదేశ్ జట్టు చరిత్ర సృష్టించింది. నజ్ముల్ హుసేన్ శాంటో సేన పాకిస్థాన్(Pakistan)పై టెస్టుల్లో తొలి విజయం నమోదు చేసింది. ఆద్యంతం ఉత్కంఠ రేపిన రావల్పిండి టెస్టులో బంగ్లా 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ముష్ఫికర్ రహీమ్(191) సూపర్ సెంచరీకి.. మెహిదీ హసన్ మిరాజ్(77, 4/21) ఆల్‌రౌండ్ షో తోడవ్వడంతో పాకిస్థాన్‌కు ఓటమి తప్పలేదు. మొదటి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ కొట్టిన పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 140 రన్స్‌కే కుప్పకూలింది. స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించిన పర్యాటక జట్టు పాకిస్థాన్ గడ్డపై మరే జట్టుకు సాధ్యంకాని రికార్డును సొంతం చేసుకుంది.
ఒకదశలో డ్రా దిశగా సాగిన రావల్పిండి టెస్టులో బంగ్లాదేశ్ అసమాన పోరాటం కనబరిచింది. బ్యాటింగ్‌లో దుమ్మురేపిన బంగ్లా.. అనంతరం పాకిస్థాన్ బ్యాటర్లకు కళ్లెం వేసింది. దాంతో, డ్రా చేసుకునే అవకాశం ఉన్నాసరే పాక్ ఆటగాళ్లు కనీస పోరాటం చేయలేకపోవడంతో బంగ్లాకు చిరస్మరణీయ విజయం సాధ్యమైంది.
What a way to register a historic win!
Test looked primed for a draw on a docile track and then Bangladesh decide to shake things up on Day 5 to inflict a huge defeat – first 10-wicket loss at home for Pakistan https://t.co/xz4BFLQVGD | #PAKvBAN pic.twitter.com/SQeqLh0CSK
— ESPNcricinfo (@ESPNcricinfo) August 25, 2024
తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ బ్యాటర్లు బంగ్లా బౌలర్లను ఉతికేశారు. మహ్మద్ రిజ్వాన్(171), సాద్ షకీల్(141)లు సెంచరీలతో చెలరేగడంతో పాకిస్థాన్ 448/6 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అయితే.. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన బంగ్లా బ్యాటర్లు పట్టుదలగా ఆడారు. ఓపెనర్ షాద్మన్ ఇస్లాం(93), మొమినుల్ హక్(50) హాఫ్ సెంచరీలతో పునాది వేయగా.. సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీం(191: 341 బంతుల్లో 22 ఫోర్లు, ఒక సిక్సర్) శతకంతో విజృంభించాడు.
Mohammad Rizwan’s effort is ended by Mehidy Hasan Miraz 🎯
A brilliant Test match for him but his dismissal pretty much seals it for Bangladeshhttps://t.co/xz4BFLQVGD | #PAKvBAN pic.twitter.com/LgUfcUOR7E
— ESPNcricinfo (@ESPNcricinfo) August 25, 2024
లిట్టన్ దాస్(56), మెహిదీ హసన్ మిరాజ్(77)లతో కలిసి రహీమ్ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో, నాలుగోరోజు బంగ్లా 565 పరుగులకు ఆలౌటయ్యింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టు బ్యాటర్లు తేలిపోయారు. రిజ్వాన్ ఒక్కడే అర్ధ శతకంతో పోరాడినా మిగతావాళ్ల నుంచి సహకారం అందలేదు. మెహిదీ హసన్ మిరాజ్(4/21), షకీబుల్ హసన్(3/44)లు చెలరేగడంతో పాక్ 146 పరుగులకే ఆలౌటయ్యింది. ఆ తర్వాత స్వల్ప లక్ష్యాన్ని బంగ్లా దేశ్ అలవోకగా చేధించింది. ఓపెనర్లు జకీర్ హసన్(15 నాటౌట్), షద్మాన్ ఇస్లాం(9)లు మెరపు బ్యాటింగ్‌తో బంగ్లాకు చారిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారు.