Bangladesh | బంగ్లాదేశ్ టెక్నికల్ కన్సల్టెంట్‌గా భారత మాజీ స్పిన్నర్
Bangladesh : వన్డే ప్రపంచ కప్( ODI World Cup 2023) ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(Bangladesh Cricket Board) కీలక నిర్ణయం తీసుకుంది. బౌలింగ్ యూనిట్‌ను పటిష్టం చేయడం కోసం భారత మాజీ స్పిన్నర్ శ్రీధరన్ శ్రీరామ్(Sridharan Sriram)ను టెక్నికల్ కన్సల్టెంట్‌గా...
Bangladesh : వన్డే ప్రపంచ కప్( ODI World Cup 2023) ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(Bangladesh Cricket Board) కీలక నిర్ణయం తీసుకుంది. బౌలింగ్ యూనిట్‌ను పటిష్టం చేయడం కోసం భారత మాజీ స్పిన్నర్ శ్రీధరన్ శ్రీరామ్(Sridharan Sriram)ను టెక్నికల్ కన్సల్టెంట్‌గా నియమించింది. శ్రీరామ్ గతంలో బంగ్లా టీ20 జట్టుకు హెడ్ కోచ్‌గా పనిచేశాడు. అతడి ఆధ్వర్యంలో ఆ జట్టు సూపర్ 12లో అద్భుత విజయాలు సాధించింది.
దాంతో, మెగా టోర్నీలో అతడి సేవల్ని ఉపయోగించుకోవాలని బంగ్లా సెలెక్టర్లు భావించారు. ‘అవును.. వరల్డ్ కప్ కోసం మేము శ్రీరామ్‌ను టెక్నికల్ కన్సల్టెంట్‌గా నియమించాం’ అని బంగ్లా టీమ్ డైరెక్టర్ ఖలీద్ మహ్మద్() తెలిపాడు. శ్రీరామ్‌కు పలు జట్లకు కోచింగ్ ఇచ్చిన అనుభవం ఉంది. ఆస్ట్రేలియా టీ20 జట్టుకు 2021- 22 సీజన్లో సహాయక కోచ్‌గా పని చేశాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ పురుషుల టీ20 జట్టుకు కోచ్‌గా శ్రీరామ్ సేవలందించాడు. అతడి హయాంలో బంగ్లా జట్టు సూపర్ 12లో అద్భుత విజయాలు సాధించింది.

అంతేకాదు ఈ మధ్యే ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) అసిస్టెంట్ కోచ్‌గా శ్రీరామ్ బాధ్యతలు చేపట్టాడు. 17వ సీజన్లో అతను హెడ్‌కోచ్ జస్టిన్ లాంగర్(Justin Langer), స్ట్రాటజిక్ కన్సల్టెంట్(Strategic Consultant) ఎమ్మెస్కే ప్రసాద్(MSK Prasad)తో కలిసి పని చేయనున్నాడు.
ఆసియా కప్ ముందు తమీమ్ ఇక్బాల్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దాంతో, మాజీ సారథి షకిబుల్ హసన్‌కు సెలెక్టర్లు బాధ్యతలు అప్పగించారు. ఆసియా కప్‌లో నాకౌట్ మ్యాచ్‌లో వెనుదిరిగిన బంగ్లా వరల్డ్ కప్‌పై భారీ ఆశలే పెట్టుకుంది. అక్టోబర్ 5న భారత్‌లో ప్రపంచ కప్ పోటీలు షురూ కానున్నాయి. అక్టోబర్ 7న అఫ్గనిస్థాన్‌తో బంగ్లాదేశ్ తలపడనుంది.
ఇవి కూడా చదవండి
ODI World Cup 2023 | దక్షిణాఫ్రికాకు కోలుకోలేని దెబ్బ.. ప్రపంచ కప్ నుంచి ఆ ఇద్దరూ ఔట్
Netherlands Cricket Team | లక్కీ ఛాన్స్ కొట్టేసిన తమిళనాడు ఫుడ్ డెలివరీ బాయ్.. నెదర్లాండ్స్ టీమ్‌కు నెట్ బౌలర్‌గా ఎంపిక
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ఆపన్నుడికి లయన్స్ క్లబ్ నోబుల్ ఆపన్నహస్తం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

