RCB | ఢిల్లీలో ఆర్సీబీకి తొలి ట్రోఫీ.. బెంగళూరులో అభిమానుల రచ్చ.. రాత్రంతా వీధుల్లోనే..
RCB | స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ.. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ టైటిల్ నెగ్గడంతో బెంగళూరులో అభిమానులు వీధుల్లోకి వచ్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బెంగళూరు పుర వీధుల్లోకి వచ్చి స్వీట్లు పంచుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటూ సంతోషంగా గడిపారు.
RCB | పదిహేడేండ్లుగా పురుషుల జట్టు సాధించలేని అద్భుతాన్ని మహిళలు దక్కించుకోవడంతో బెంగళూరు అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఆదివారం రాత్రి ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టును చిత్తుచేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. తొలి ట్రోఫీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ.. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్ టైటిల్ నెగ్గడంతో బెంగళూరులో అభిమానులు వీధుల్లోకి వచ్చి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బెంగళూరు పుర వీధుల్లోకి వచ్చి స్వీట్లు పంచుకుంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటూ సంతోషంగా గడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
బెంగళూరులోని శివాజీ నగర్, చర్చ్ స్ట్రీట్, ఎంజీ రోడ్, సప్తపురతో పాటు ఇతర ప్రాంతాల్లో అభిమానులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆర్సీబీ విక్టరీని సెలబ్రేట్ చేసుకున్నారు. అభిమానుల కోసం కొన్ని హోటల్స్, మాల్స్‌తో పాటు కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు ప్రత్యేకంగా స్క్రీన్లను ఏర్పాటుచేయడంతో పెద్ద ఎత్తున జనం ఆ ప్రాంతాల్లో గుమిగూడారు. ఢిల్లీ ఇన్నింగ్స్ నామమాత్రపు స్కోరుకే పరిమితం కావడంతోనే అభిమానుల్లో జోష్ మొదలైంది. విజయం లాంఛనమే అని తేలడంతో ఫ్యాన్స్ పార్టీ మూడ్‌లోకి వెళ్లిపోయారు.
CHINNASWAMY ERUPTED last night so as Church street, MG road, Shivajinagar, Bengaluru partied hard n slept peacefully. #Bengaluru #WPL2024 #PlayBold @RCBTweets
— Sara Hegde (@isaratweetz) March 18, 2024
Bangalore Street after the first trophy won by RCBW 🏆🔥🔥!!!#WPLFinal#CongratulationsRCBW#ViratKohli𓃵 #ViratKohli #WPL2024 #perry #mandhana#Bangalore #Bengaluru pic.twitter.com/4P1NGeUPJu
— kanna (@ThupiliKarunak1) March 17, 2024
ఈ మ్యాచ్‌లో ఢిల్లీని 113 పరుగులకే పరిమితం చేసిన ఆర్సీబీ.. లక్ష్యాన్ని ఆఖరి ఓవర్లో ఛేదించింది. కెప్టెన్, ఓపెనర్ స్మృతి మంధాన , సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీలు సమయోచిత ఇన్నింగ్స్‌లు ఆడారు. అంతకుముందు ఢిల్లీ ఇన్నింగ్స్‌ను సోఫీ మొలినెక్స్, శ్రేయాంక పాటిల్, ఆశా శోభన కుప్పకూల్చారు.
BENGALURU HAVE GONE NUTS AFTER THE TROPHY WIN. 🤯🏆pic.twitter.com/iC8QFL8rDY
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 17, 2024
MADNESS IN BANGALORE 🤯
– ONE OF THE BEST FANS IN SPORTING HISTORY.pic.twitter.com/mDQB1lz0fu
— Johns. (@CricCrazyJohns) March 17, 2024
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

