Commonwealth Games 2026 : ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాల పంట పండించేందుకు సిద్ధమైన భారత అథ్లెట్లకు భారీ షాక్. ఈసారి హాకీ, క్రికెట్‌తో పాటు పలు క్రీడలను తొలగిస్తూ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. దాంతో, భారత బ్యాడ్మింటన్ సమాఖ్య (BAI) గ్లాస్గో అధికారులపై తీవ్రంగా మండిపడుతోంది. భారత్‌కు పతకాలు రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారని బాయ్ జనరల్ సెక్రటరీ సంజయ్ మిశ్రా (Sanjay Mishra) ఆగ్రహం వ్యక్తం చేశాడు.
క్రీడల్లో భారత దేశ ప్రగతిని అడ్డుకోవాలనే కుట్రతోనే కామన్వెల్త్ గేమ్స్ నుంచి పలు క్రీడలను తొలగించారు. దాంతో, ఈసారి దాదాపు 40 పతకాలు తగ్గే అవకాశముంది. ఇది నిజంగా ఊహించని పరిణామం. పతకాలతో దేశాన్ని గర్వించేలా చేయాలనుకున్న అథ్లెట్లకు, భారత బృందానికి ఇది పెద్ద ఎదురు దెబ్బ అని సంజయ్ తెలిపాడు.
A blow to Indian sports!
Badminton Association of India’s General Secretary, Sanjay Mishra speaks out on the exclusion of badminton from the Commonwealth Games 2026 🗣️#IndiaontheRise#Badminton pic.twitter.com/7vtmHMQTpr
— BAI Media (@BAI_Media) October 22, 2024
భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ఇ’ది నిజంగా మా అందరికీ షాక్. ఎంతో నిరాశ చెందాం. అయితే.. ఇప్పుడు మా చేతుల్లో ఏమీ లేదు’ అని అన్నాడు. బ్యాడ్మింటన్ దిగ్గజం, ప్రస్తుతం ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్న పుల్లెల గోపిచంద్(Pullela Gopichand) సైతం కామన్వెల్త్ గేమ్స్ నిర్వాహకుల తీరును తప్పుపట్టాడు. భారత్ వంటి దేశాలకు ఇది శరాఘాతమని, అంతర్జాతీయ వేదికలపై మెరవాలనుకుంటున్న వర్థమాన ఆటగాళ్లకు తీరని అన్యాయమని గోపిచంద్ అన్నాడు.
Indian badminton legend & chief national coach Pullela Gopichand shared his thoughts on exclusion of badminton from the Commonwealth Games 2026 🗣️ #IndiaontheRise#Badminton pic.twitter.com/Y7poCh54re
— BAI Media (@BAI_Media) October 22, 2024
రెండేండ్ల తర్వాత జరగాల్సిన కామన్వెల్త్ గేమ్స్‌కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వాల్సింది. కానీ, ఆ దేశం తప్పుకోవడంతో చివరకు గ్లాస్గో ముందుకొచ్చింది. అయితే.. ఆర్థిక భారం నెపంతో పలు ఆటలను నిర్వహించొద్దని ఆ దేశ అధికారులు భావించారు. అందులో భాగంగానే భారత్ పతకాలు కొల్లగొట్టేందుకు వీలున్న క్రికెట్, హాకీ, నెట్ బాల్, రేస్ వాకింగ్, ఆర్చరీ, స్క్వాష్, టేబుల్ టెన్నిస్.. వంటి క్రీడలను కామన్వెల్త్ గేమ్స్ 2026 నుంచి తొలగించారు. అయితే.. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వాహకులు నిర్ణయాన్ని మార్చుకుంటారా? లేదా? అనేది త్వరలోనే తెలియనుంది.