తిరుమల : తిరుమలలోని(Tirumala) మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రంలో (Annaprasadam) టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భోజనం రుచి, నాణ్యత గురించి భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం భక్తులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. భోజనం రుచి, నాణ్యత చాలా బాగుందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రాజేంద్ర, స్పెషల్ క్యాటరింగ్ అధికారి శాస్త్రి పాల్గొన్నారు.
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రెండు కంపార్టుమెంట్లు (Compartments) భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 6 గంటల్లో సర్వదర్శనం అవుతుందని అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 64,894 మంది భక్తులు దర్శించుకోగా 23,355 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.82 ఆదాయం వచ్చిందని వెల్లడించారు.