Babar Azam : పొట్టి ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ (Pakistan) ఘోర వైఫల్యంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. జట్టులో మూడు గ్రూప్‌లు ఉన్నాయని, ఆటగాళ్ల మధ్య సమిష్టితత్వం కొరవడిందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం (Babar Azam) మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని కొందరు ఆరోపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బాబర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు.
తనపై లేనిపోని అభాండాలు మోపిన సీనియర్ జర్నలిస్ట్ ముబాషిర్ లుక్మన్ (Mubashir Luqman) ను కోర్టుకు ఈడ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే బాబర్ న్యాయస్థానం ముందు ఉంచాల్సిన విషయాల గురించి తమ దేశంలోని లాయర్లను ఆశ్రయించినట్టు సమాచారం.
అసలేం జరిగిందంటే..? టీ20 వరల్డ్ కప్‌లో పాక్ జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించింది. పసికూన అమెరికాపై దారుణ ఓటమి తర్వాత భారత్‌పై చేజేతులా ఓడడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. దాంతో, బాబర్ ఆజాం మ్యాచ్ ఫిక్సింగ్ చేశాడని, ప్రతిఫలంగా విలువైన బహుమతులు స్వీకరించాడని పాక్ సీనియర్ జర్నలిస్ట్ ముబాషిర్ ఆరోపించాడు.
These are serious allegations on Babar Azam from senior journalist Mubashir Luqman.
Investigation should be done by PCB.
More to come in upcoming days…#WT20_2024 pic.twitter.com/o1ji2JlApd— Cric mate (@cricmatee07) June 19, 2024
ఒక వీడియోలో ముబాషిర్ మాట్లాడుతూ.. ‘బాబర్ ఈ మధ్యే కొత్త ఆడి ఈ ట్రాన్ కారును సోదరుడి నుంచి కానకగా పొందాడని.. నిజానికి అది ఒక బుకీ కొనిచ్చాడు. అంతేకాదు బాబర్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఖరీదైన అపార్ట్మెంట్లు కొన్నాడు’ అని తెలిపాడు. దాంతో, ఆ వీడియో పాక్ మీడియాలో వైరల్ అయింది. తనపై ముబాషిర్ చేసిన వ్యాఖ్యల్ని సీరియస్‌గా తీసుకున్న బాబర్ కోర్టులో దావా వేసి బుద్ది చెప్పాలని భావించాడు.