ముంబై : పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, భారత రత్న వంటి పౌర పురస్కారాలు అధికారిక బిరుదులు కావని, వాటిని ఎవరూ తమ పేర్ల ముందు కాని, వెనుక కాని ఉపయోగించరాదని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది.
2004లో పద్మ అవార్డును స్వీకరించిన శరద్ మోరేశ్వర్ హర్దీకర్ తన పిటిషన్లో తన పేరు ముందు పద్మశ్రీ అని రాసుకోవడంపై బాంబే హైకోర్టు బుధవారం విచారణ సందర్భంగా అభ్యంతరం తెలిపింది. పౌర అవార్డులను తమ పేర్ల ముందు రాసుకోవడం చట్టపరంగా తప్పని జస్టిస్ సోమశేఖర్ సుందరేశన్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ సందర్భంగా 1995లో సుప్రీంకోర్టుకు చెందిన రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును హైకోర్టు ప్రస్తావించింది