భార్యపై పెట్రోలు పోసి.. నిప్పంటించి..
భార్యపై అనుమానంతో ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోలు పోసి నిప్పంటించిన భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ జె.నర్సయ్య వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, అంబేద్కర్‌నగర్‌కు చెందిన వెంకటేశ్ లేబర్ పని చేస్తుంటాడు.
అంబర్‌పేట, డిసెంబర్ 26: భార్యపై అనుమానంతో ఆమె నిద్రిస్తున్న సమయంలో పెట్రోలు పోసి నిప్పంటించిన భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ జె.నర్సయ్య వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్, అంబేద్కర్‌నగర్‌కు చెందిన వెంకటేశ్ లేబర్ పని చేస్తుంటాడు. త్రివేణి(26)ని ప్రేమ పెండ్లి చేసుకున్నాడు. వీరికి బాబు, పాప సంతానం. కొంతకాలంగా త్రివేణిని అనుమానిస్తున్న వెంకటేశ్.. ఆమెతో గొడవపడుతూ కొట్టేవాడు.. వేధించేవాడు. దీంతో ఎనిమిది నెలలుగా దూరంగా ఉన్నారు.
ఇటీవలే తాను మారిపోయానని భార్య త్రివేణికి చెప్పి మళ్లీ ఆమె వద్దకు వచ్చాడు. నల్లకుంట తిలక్‌నగర్‌లో గదిని అద్దెకు తీసుకొని నివాసముంటున్నారు. అతను సెంట్రింగ్ పనికి వెళ్తుండగా, త్రివేణి హౌస్‌కీపింగ్ పనికి వెళ్తుండేది. ఏ కొంచెం ఆలస్యమైనా అనుమానిస్తూ గొడవపడేవాడు. ఈ నేపథ్యంలో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం పెట్రోలు తీసుకొచ్చి గదిలో దాచాడు. ఈ నెల 23వ తేదీ రాత్రి త్రివేణి నిద్రిస్తుండగా, వెంకటేశ్ తన కుమారుడిని బయటకు తీసుకువచ్చి నిల్చోబెట్టాడు. మళ్లీ లోపలకు వెళ్లి నిద్రిస్తున్న భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించాడు.
బయటకు వచ్చి కుమారుడిని తీసుకొని పరారయ్యాడు. కూతురు లేచి అరవడంతో చుట్టుపక్కల వాళ్లు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. లోపలకు వెళ్లి చూడగా, అప్పటికే త్రివేణి 90 శాతం కాలిన గాయాలతో పడి ఉంది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని గాంధీ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. మృతురాలి తండ్రి అప్పలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు వెంకటేశ్‌ను సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో పట్టుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

