రాత్రిపూట సాక్సులు వేసుకొని పడుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా, శీతాకాలంలో చలినుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు, సాక్సుల వల్ల పాదాల్లోని రక్తనాళాలు వ్యాకోచించి, రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రతలు సమతుల్యంగా మారుతాయి. ఇది త్వరగా గాఢ నిద్రలోకి జారుకోవడానికి సాయపడుతుంది.