BAN vs NZ : బంగ్లాదేశ్ గడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్‌ను ఓటమితో ఆరంభించిన న్యూజిలాండ్ (Newzealand) అనూహ్యంగా పుంజుకుంది. సిరీస్‌లో కీలకమైన రెండో టెస్టులో టిమ్ సౌథీ(Tim Southee) సేన గెలుపు వాకిటి నిలిచింది. రసవత్తరంగా సాగుతున్నఈ మ్యాచ్‌లో మిస్టరీ స్పిన్నర్ అజాజ్ పటేల్(Azaz Patel) 6 వికెట్లతో, మిచెల్ శాంటర్న్ 3 వికెట్లతో బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టారు. దాంతో, అతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 144 పరుగులకే కుప్పకూలింది. దాంతో, ఈ మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్ సమం చేసేందుకు కివీస్‌కు 138 పరుగులు కావాలి.
తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిఫ్స్ గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. బ్యాటింగ్‌కు అనుకూలించని పిచ్‌పై ఒంటరిపోరాటం చేసిన ఫిలిఫ్స్ 72 బంతుల్లో 87; 9 ఫోర్లు, 4 సిక్సర్లు బాది జట్టును గట్టెక్కించాడు. అయితే.. టామ్ లాథమ్ (4), డెవాన్ కాన్వే (11), కేన్ విలియమ్సన్ (13), నికోల్స్ (1), డారిల్ మిషెల్ (18), బ్లండెల్ (0), శాంట్నర్ (1) విఫలమవ్వడంతో కివీస్ 180 పరుగులకే ఆలౌటయ్యింది.
Ajaz Patel takes six as New Zealand bowl Bangladesh out for 144!#WTC25 | #BANvNZ |📝 https://t.co/sgXm4xo1ZM pic.twitter.com/JuLp6lOk7y
— ICC (@ICC) December 9, 2023
అనంతరం రెండో ఇన్నింగ్స్ మొదలెట్టిన బంగ్లా ఆది నుంచి తడబడింది. మూడో రోజు ఆట ముగిసే సరికి బంగ్లా 2 వికెట్ల నష్టానికి 38 పరుగులు చేసింది. 30 పరుగుల ఆధిక్యంతో నాలుగో రోజు బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు ఆజాజ్ పటేల్ షాకిచ్చాడు. హాఫ్ సెంచరీతో జోరుమీదున్న ఓపెనర్ జకీర్ హసన్(59)ను ఔట్ చేసిన అజాజ్.. షొరిఫుల్ ఇస్లాం(8) వికెట్ తీసి బంగ్లా ఇన్నింగ్స్‌కు తెరదించాడు.