Alyssa Healy | ఆస్ట్రేలియా ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా హేలీ.. వైస్ కెప్టెన్ ఎవరంటే..?
Alyssa Healy : ఆస్ట్రేలియా మహిళా జట్టు తాత్కాలిక కెప్టెన్‌గా కొనసాగుతున్న అలిసా హేలీ(Alyssa Healy) పూర్తి స్థాయి సారథిగా ఎంపికైంది. మేగ్ లానింగ్(Meg Lanning) వారసురాలిగా హేలీని ఖరారు చేస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia) శనివారం నిర్ణయం...
Alyssa Healy : ఆస్ట్రేలియా మహిళా జట్టు తాత్కాలిక కెప్టెన్‌గా కొనసాగుతున్న అలిసా హేలీ(Alyssa Healy) పూర్తి స్థాయి సారథిగా ఎంపికైంది. మేగ్ లానింగ్(Meg Lanning) వారసురాలిగా హేలీని ఖరారు చేస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా(Cricket Australia) శనివారం నిర్ణయం తీసుకుంది. ఆల్‌రౌండర్ తహ్లియా మెక్‌గ్రాత్(Tahlia Mcgrath)ను వైస్ కెప్టెన్‌గా సెలెక్ట్ చేశారు.
‘ఆసీస్ సారథిగా ఎంపికైనందకు చాలా గర్వంగా ఫీలవుతున్నా. జట్టును నడిపించే అవకాశం దొరికినందుకు సంతోషంగా ఉంది. గత కొన్ని నెలలుగా జట్టు సభ్యులు ఎంతో సహకారం అందించారు’ అని హేలీ తెలిపింది.
Introducing our official @AusWomenCricket leadership duo!
Congratulations to Alyssa and Tahlia 👏 pic.twitter.com/soNHQXQPOz
— Cricket Australia (@CricketAus) December 8, 2023
మేగ్ లానింగ్ వీడ్కోలు పలకడంతో క్రికెట్ ఆస్ట్రేలియా హేలీని తాత్కాలిక సారథిగా నియమించింది. జూన్ నుంచి ఆమె ఇంగ్లండ్, ఐర్లాండ్, వెస్టిండీస్ సిరీస్‌లకు టెంపరరీ కెప్టెన్‌గా వ్యవహరించింది. ఇకనుంచి ఆమె వికెట్ కీపర్, కెప్టెన్‌గా సేవలందించనుంది.
అలిసా హేలీ

మరోవిషయం ఏంటంటే..? హేలీ.. ఆసీస్ పురుషుల జట్టు స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ భార్య . నిరుడు బీసీసీఐ తొలిసారి నిర్వహించిన మహిళల ప్రీమియర్ లీగ్(WPL 2022)లో సత్తా చాటింది. యూపీ వారియర్స్(UP Warriorz) జట్టు సారథిగా వ్యవహరించిన ఆమె జట్టును ముందుండి నడిపించింది. దాంతో, రెండో సీజన్ కోసం యూపీ ఫ్రాంచైజీ హేలీని అట్టిపెట్టుకుంది.
ఇవి కూడా చదవండి
- KCR| బీఆర్ఎస్ఎల్పీ లీడర్‌గా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక
- Nushrratt Bharuccha | ట్రెండీ అందాలతో దిల్ ఖుష్ చేస్తున్న నుష్రత్ బరుచా..
- Ministers | ఆర్థిక మంత్రిగా భట్టి.. శ్రీధర్‌బాబుకు ఐటీ, పరిశ్రమలు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

