KCR | బీఆర్ఎస్ఎల్పీ లీడర్‌గా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక
KCR | బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా (BRSLP leader) ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) ఎన్నికయ్యారు. పార్టీ సీనియర్ నాయకులు కె.కేశవరావు అధ్యక్షతన శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు.
KCR | బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా (BRSLP leader) ఆ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) ఎన్నికయ్యారు. పార్టీ సీనియర్ నాయకులు కె.కేశవరావు అధ్యక్షతన శనివారం ఉదయం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా పార్టీ అధినేత కేసీఆరే ఉండాలని ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యేలు బలపరిచారు. బీఆర్ఎస్ఎల్పీ లీడర్‌గా పార్టీ అధినేత కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ మొదటి సమావేశాలు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. సభలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు సమావేశమై పార్టీ విధివిధానాలు, అభ్యర్థుల ప్రవర్తనా నియమావళి, సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం తదితర అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ ముందు ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నివాళులు అర్పించి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు.
బీఆర్ఎస్ఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు గారి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. కేసీఆర్ గారి పేరును ప్రతిపాదించగా మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్,… pic.twitter.com/mWCeGG2hIN
— BRS Party (@BRSparty) December 9, 2023
Also Read..
Ministers | ఆర్థిక మంత్రిగా భట్టి.. శ్రీధర్‌బాబుకు ఐటీ, పరిశ్రమలు
Free Bus Journey | బాబోయ్ ఉచిత బస్సులు.. పథకం అమలుతో కర్ణాటకలో కొత్త సమస్యలు
Tribal University | ములుగుకు మణిహారంలా గిరిజన వర్సిటీ.. పదేండ్లకు నెరవేరిన విభజన హామీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS party
- BRSLP leader
- KCR
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
యాసంగిలో ఆరుతడి పంటల సాగు మేలు : ఏడీఏ సరిత
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

